సుప్రీం కోర్టులో ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజుకు చుక్కెదురైంది.

సుప్రీం కోర్టులో ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజుకు చుక్కెదురైంది. సీబీఐ కేసుల్లో వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జగన్‌ కేసులను బదిలీ చెయ్యాలని రఘురామ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో పాటు బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవని, అలాంటప్పుడు రద్దు అవసరమే లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం రఘురామ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపింది. అయితే జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే సీబీఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమన్న ధర్మాసనం.. కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా? అంటూ పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ehatv

ehatv

Next Story