Revanth Reddy Petition : ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
ఓటుకు నోటు కేసులో(Note For Vote) తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి(TPCC Chief Revanth Reddy) సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjeev Khanna), జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఓటుకు నోటు కేసులో(Note For Vote) తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి(TPCC Chief Revanth Reddy) సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjeev Khanna), జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను గతంలో హైకోర్టు(High Court) కొట్టేసింది. దాంతో రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేయడంతో రేవంత్‌రెడ్డికి మరోసారి భంగపాటు ఎదురయ్యింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి(TDP) అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేసిన విషయం కూడా విదితమే. అప్పట్లో తెలుగుదేశంపార్టీలో ఉన్న రేవంత్‌రెడ్డి స్వయంగా స్టీఫెన్‌సన్ ఇంటికి వెళ్లి భారీ మొత్తంలో నగదుతో ప్రలోభాలకు గురిచేసిన వీడియో బయటకు వచ్చింది. ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో నేడు సుప్రీంలో విచారణకు వచ్చింది.