తెలుగు రాష్ట్రాలు భగభగమండిపోతున్నాయి. తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్నాయి. నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) తొమ్మిది జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న రాజమండ్రిలో(Rajahmundry) 49 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యింది.

తెలుగు రాష్ట్రాలు భగభగమండిపోతున్నాయి. తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్నాయి. నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) తొమ్మిది జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న రాజమండ్రిలో(Rajahmundry) 49 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇవాళ ఏపీలోని 20 మండలాలలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. మునగాల, దామరచర్లలో నిన్న 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు ప్రజలు. వడదెబ్బతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఏపీలో ఇప్పటికే 12 మంది చనిపోయారు. తెలంగాణలో ముగ్గురు మరణించారు. బయటకు వస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందేమోనన్న భయంతో జనం ఇంటి నుంచి కాలు బయటపెట్టడం లేదు.

Updated On 17 May 2023 12:37 AM GMT
Ehatv

Ehatv

Next Story