Sujana Chowdary : విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తా
విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి తెలిపారు.

Sujana Chowdary Reacts to His Contesting for the Vijayawada MP Seat
విజయవాడ లోక్ సభ స్థానం(Vijayawada MP Seat) నుంచి పోటీ చేస్తానని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి(Sujana Chowdary) తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ(BJP) అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు. పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం ఉంటుందని.. విజయవాడ నుంచి బీజేపీ పోటీ చేస్తే గెలుపు ఖాయం అన్నారు
అమరావతే(Amaravathi) ఏపీ రాజధాని(AP Capital)గా ఉంటుందని.. మా అధిష్టానం కూడా అమరావతికి అనుకూలమేనని పేర్కొన్నారు. ఏపీ ఎన్నికలపై బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. ఏపీలో ఈ సారి ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరుగుతాయన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీ ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకుంటుందన్నారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు ఈసీ దూరంగా ఉంచడం హర్షణీయం అన్నారు.
