Sujana Chowdary : కులాలు, మతాలు కూడు పెట్టవు.. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో నిరూపిస్తా
కులాలు, మతాలు కూడు పెట్టవని, భావితరాలు పైకి రావడానికి, పేదరికాన్ని జయించడానికి కేంద్రం అనేక పథకాలు ఇచ్చిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు.

Sujana Chowdary Comments on YSRCP
కులాలు, మతాలు కూడు పెట్టవని, భావితరాలు పైకి రావడానికి, పేదరికాన్ని జయించడానికి కేంద్రం అనేక పథకాలు ఇచ్చిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. వైసీపీ అరాచకపాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. సమర్థుడైన నాయకుడు, ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చేసి చూపాలనే ధ్యేయంతో ముందుకు వస్తున్నానని సుజనా వివరించారు. నాయకత్వ లోపంతో, రాజకీయ కారణాలతో ఇప్పటివరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఈ అయిదేళ్ళలో జగన్ పాలనలో ఒక్క మంచి పని కూడా జరగలేదన్నారు. ప్రజలు ఓడిస్తారని తెలిసే వైసీపీ అధినేత నియోజకవర్గ ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
