Sujana Chowdary : తాను నాన్ లోకల్ అంటూ చేస్తున్న ప్రచారాన్ని పట్టించుకోను
ఎన్నికల్లో ఆశీర్వదించండి.. పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలను కోరారు.

Sujana Chaudhary counters YCP criticism
ఎన్నికల్లో ఆశీర్వదించండి.. పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గం అనేక దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతంగా ఉందని.. గత పాలకులు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. నియోజవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీల నిర్మాణం, కొండ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలు, ప్రత్యేకమైన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విద్యా వైద్యం అన్ని రకాల సదుపాయాలని కల్పిస్తానని అన్నారు.
తాను నాన్ లోకల్ అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను పట్టించుకోబోనని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా బిడ్డగా మాతృభూమికి పశ్చిమ నియోజకవర్గానికి సేవ చేయడం దైవ నిర్ణయంగా భావిస్తున్నానన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకారం అందించానన్నారు. వించిపేట నైజాం గేట్ ప్రాంతాలలోని డ్రైన్ల అభివృద్ధి టీడీపీ-బీజేపీ హయాంలోనే జరిగిందన్నారు. జిల్లాలో పుట్టి పెరిగిన తనకి ఇక్కడ అవసరాలు అభివృద్ధిపై అంచనాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేగా సేవ చేసుకునే అవకాశం ప్రజలు ఇస్తే నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తానని, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.
