Ramachandrapuram : భర్త నిద్ర పోయిన తర్వాత ప్రియుడికి భార్య మెసేజ్.. ఆ తర్వాత జరిగిందిదే..!
ఓ భార్య(Wife) ప్రియుడి(Boyfriend) మోజులో పడింది. ప్రియుడిని కలిసేందుకు అడ్డుగా ఉన్న భర్తను(Husband) తొలగించుకోవాలనుకుంది. ఓ వ్యక్తి తన ముగ్గురి అక్కల్లో పెద్దదైన ప్రసన్న కూతురు సుహితను మేనమామ పెళ్లి చేసుకున్నాడు. మేనమామతో పెళ్లి ఇష్టం లేని సుహిత పక్కదారి పట్టింది. భర్త స్నేహితుడి వరతో వివాహేతర సంబంధం(Extra marital affair) ఏర్పర్చుకుంది. ఈ విషయమై భర్త పలుసార్లు సుహితను హెచ్చరించాడు. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం..
ఓ భార్య(Wife) ప్రియుడి(Boyfriend) మోజులో పడింది. ప్రియుడిని కలిసేందుకు అడ్డుగా ఉన్న భర్తను(Husband) తొలగించుకోవాలనుకుంది. ఓ వ్యక్తి తన ముగ్గురి అక్కల్లో పెద్దదైన ప్రసన్న కూతురు సుహితను(Suhitha) మేనమామ పెళ్లి చేసుకున్నాడు. మేనమామతో పెళ్లి ఇష్టం లేని సుహిత పక్కదారి పట్టింది. భర్త స్నేహితుడి వరతో వివాహేతర సంబంధం(Extra marital affair) ఏర్పర్చుకుంది. ఈ విషయమై భర్త పలుసార్లు సుహితను హెచ్చరించాడు. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం..
రామచంద్రాపురం(Ramachandrapuram) రామాలయం వీధిలో ఉండే ప్రసాద్(Prasad) అనే వ్యక్తి అన అక్క కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి ఇష్టంలేని సుహిత ప్రసాద్ స్నేహితుడు వరతో(Vara) వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. ఇదే విషయంపై ఇంట్లో గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు వారించిన సుహిత తన పద్దతి మార్చుకోలేదు. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో భర్తను లేపేస్తే అయిపాయె అనుకుంది. తన భర్త ఇంట్లో నిద్రపోయాడని చంపి వేయాలని ప్రియుడికి మెసేజ్ ఇచ్చింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రియుడు వర తన స్నేహితులతో కలిసి వచ్చి ప్రసాద్‌ను అత్యంత కిరాతకంగా చంపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రసాద్ హత్యపై ఆరా తీశారు. ఇంట్లో నుంచి నలుగురు వ్యక్తులు వెళ్లిపోవడాన్ని గమనించిన ప్రసాద్ అక్క పోలీసులకు విషయం చెప్పింది. దీంతో నిందితురాలు సుహితను అదుపులోకి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ప్రియుడితో కలిసి తానే హత్య చేయించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. ఐదుగురు నిందితులు వర, నాగేంద్రబాబు, లివింగ్‌స్టన్, మనోహర్, వెంకటసాయి, సాగర్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.