Cyclone Michaung : ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాను.. నేడు, రేపు భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలోని మిచౌంగ్ తుఫాను వాయువ్య దిశగా కదులుతుందని ఇది ఆదివారం రాత్రి 8 గంటల నాటికి చెన్నైకి 210 కి.మీ, నెల్లూరుకు 330 కి.మీ, బాపట్లకు 440 కి.మీ, మచిలీపట్నానికి 450 కి.మీ. దూరంలో ఉందని
నైరుతి బంగాళాఖాతంలోని మిచౌంగ్ తుఫాను(Cyclone Michaung) వాయువ్య దిశగా కదులుతుందని ఇది ఆదివారం రాత్రి 8 గంటల నాటికి చెన్నై(Chennai)కి 210 కి.మీ, నెల్లూరుకు 330 కి.మీ, బాపట్లకు 440 కి.మీ, మచిలీపట్నానికి 450 కి.మీ. దూరంలో ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్(BR Ambedhkar) తెలిపారు. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలపడి సోమవారం ఉదయానికి దక్షిణ కోస్తా(South Costal), ఉత్తర తమిళనాడు(South Tamilnadu) తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంకు చెరుకుంటుందని ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తూ ఎల్లుండి మధ్యాహ్నం నెల్లూరు(Nellore) - మచిలీపట్నం(Machilipatnam) మధ్య తీవ్రతుఫానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వివరించారు. తీరం దాటిన తరువాత క్రమంగా బలహీనపడుతుందని తెలిపారు.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో సోమ,మంగళవారం కూడ కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయన్నారు. బుధవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ, రేపు సాయంత్రం నుంచి గంటకు 90-110 కీమీ వేగంతో గాలులు వీస్తాయన్నారు, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదన్నారు.
ఎప్పటికప్పుడు విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్(Control Room) నుండి వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేస్తునట్లు తెలిపారు. విపత్కర పరిస్థితులు వస్తే ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే తుఫాను ప్రభావం చూపే లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు, సహాయక శిబిరాలకు తరలించడానికి జిల్లాయంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. సహాయక చర్యలకోసం 4 ఎన్డీఆర్ఎఫ్ , 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత జిల్లాలకు ఇప్పటికే చేరయన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు తుఫాన్ హెచ్చరిక మేసేజులు పంపిస్తున్నామని చెప్పారు. ప్రజలు అత్యవసర సహయం, సమాచారం కోసం విపత్తుల సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు.