తొక్కిసలాటలో ఆరుగురు మృతి

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా ఏర్పడిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. చనిపోయిన వారిలో అయిదుగురు మహిళలు ఉన్నారు. మరో 60 మందికి పైగా గాయాలు అయ్యాయి. వీరిలో 34 మందికి రుయా, స్వీమ్స్‌ ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠద్వార దర్శనం టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతిలో తొమ్మిది కేంద్రాల లో 94 కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రమే భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. భక్తులను బైరాగిపట్టెడ దగ్గర పద్మావతి పార్కులో ఉంచారు. టోకెన్ల కేంద్రంలోని సిబ్బందిలోని ఒకరు అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి క్యూలైన్‌ తెరిచారు. టోకెన్లు జారీ చేసేందుకే క్యూలైన్‌ తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. తమిళనాడు సేలంకు చెందిన మహిళ విష్ణు నివాసం వద్ద టోకెన్లు తీసుకునేందుకు ప్రయత్నించారు. దాంతో భక్తుల మధ్య ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. గాయపడిన మల్లిక అనే మహిళను ముందుగా ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి రుయా దవాఖానకు తరలిస్తుండగా మర్గమధ్యంలో ఆమె మృతిచెందారు. మిగిలిన క్షతగాత్రులను సిమ్స్‌, రుయాకు తరలించారు. రుయాలో చికిత్సపొందుతూ మరో అయిదుగురు భక్తులు మృతిచెందారు.

ehatv

ehatv

Next Story