ప్రాంతీయపార్టీలు కుటుంబపార్టీలుగా మారిపోయి చాలా కాలం అయ్యింది.

ప్రాంతీయపార్టీలు కుటుంబపార్టీలుగా మారిపోయి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రాంతీయపార్టీలో కుటుంబపాలనే నడుస్తోంది. డీఎంకే పార్టీ(DMK) కరుణానిధి(Karunanidhi) చేతిలో పడిన తర్వాత ఆయన కుటుంబసభ్యులే పార్టీని నడిపిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi party), రాష్ట్రీయ జనతాదళ్‌, జనతాదళ్‌ సెక్యులర్‌, తెలుగుదేశంపార్టీ(TDP), బీఆర్‌ఎస్‌(BRS) ఇవన్నీ ఇవే బాపతు. తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజూ జనతాదళ్‌, నేషనల్ కాన్ఫరెన్స్‌, పీడీపీ.. ఇలా ఏ ప్రాంతీయ పార్టీ చూసినా వారసత్వపు రాజకీయాలే కనిపిస్తాయి. తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. స్టాలిన్‌(Stalin) ముఖ్యమంత్రి. ఆయన కుమారుడు ఉదయనిధి(Udhya nidhi) మంత్రిగా ఉన్నారు. ఇప్పుడాయనకు ప్రమోషన్‌ వచ్చింది. ఉప ముఖ్యమంత్రి(Deputy cm) అయిపోయారు. ఉదయనిధి డిప్యూటీ సీఎం అయ్యేసరికి ఇప్పుడు అందరి దృష్టి నారా లోకేశ్‌(Nara Lokesh) మీద పడింది. ఎన్టీఆర్‌(NTR) స్థాపించిన తెలుగుదేశంపార్టీ చంద్రబాబు నాయుడు చేతిలో చిక్కిన తర్వాత వారసత్వ పార్టీగా మారిపోయింది. చంద్రబాబు తర్వాత ఎవరు అంటే లోకేశే అంటున్నారు తప్ప సీనియర్ల పేర్లు రావడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఉనప్పటికీ దానికి సారథి చంద్రబాబునాయుడే(Chandrababu)! ఆయన ఎంత చెబితే అంత! కూటమిలో ఉన్న జనసేన(Janasena), బీజేపీలకు(BJP) ఎదురుచెప్పేంత ధైర్యం లేదు. ఆ సాహసం కూడా చేయరు. లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రిని చేస్తే కాదనేవారు ఎవరూ ఉండరు. ఆ మాటకొస్తే ఉదయనిధి స్టాలిన్‌ కంటే మా లోకేశే సీనియర్‌ అని చినబాబు ఫ్యాన్స్‌ అంటున్నారు. 2017లోనే లోకేష్ మంత్రి అయి రెండేళ్ల పాటు పనిచేశారని, ఇపుడు మరోసారి మంత్రిగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. నిజానికి 2019 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ గెలిచి ఉంటే లోకేశ్‌ సీఎం అయ్యేవారు అనే వారు కూడా లేకపోలేదు. టీడీపీకి సొంతంగా మెజారిటీ ఉన్నా జనసేన, బీజేపీలను దూరం చేసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. అందుకే లోకేశ్‌ మంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. టీడీపీ సొంతంగా పభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉంటే మాత్రం సీఎం అయ్యేవారు. ఇప్పుడు ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి పదవి ఉండాలనే నియమాన్ని పెటుకున్నారు కాబట్టి పవన్‌ ఒక్కటే డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. గతంలోలా డిప్యూటీ సీఎం పదవులను నలుగురైదుగురికి ఇచ్చి ఉంటే అందులో లోకేశ్‌ తప్పకుండా ఉండేవారు. లోకేశ్‌కు డిప్యూటీ సీఎం యోగం ఏం ఖర్మ..? ఏకంగా ముఖ్యమంత్రే అవుతారని ఆయన హార్డ్‌కోర్‌ అభిమానులు అంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story