Salakatla Brahmotsavam : ముగింపు దశకు చేరుకున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు... వైభవంగా చక్రస్నానం
తిరుమల(Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Salakatla Brahmotsavam) ముగింపు దశకు చేరుకున్నాయి. చివరిరోజైన మంగళవారం పుష్కరిణిలో(Pushkarini) శ్రీవారికి చక్ర స్నానం వేడుకగా ముగిసింది. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం(hakrasnanam) జరిగింది. స్వామివారికి చక్రత్తాళ్వార్ రూపంలో చక్రస్నానం చేయించారు.
తిరుమల(Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Salakatla Brahmotsavam) ముగింపు దశకు చేరుకున్నాయి. చివరిరోజైన మంగళవారం పుష్కరిణిలో(Pushkarini) శ్రీవారికి చక్ర స్నానం వేడుకగా ముగిసింది. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం(hakrasnanam) జరిగింది. స్వామివారికి చక్రత్తాళ్వార్ రూపంలో చక్రస్నానం చేయించారు. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి(Malayappa Swami), చక్రత్తాళ్వర్‌కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రత్తాళ్వరుకు అర్చకులు పుష్కరిణీలో పవిత్ర స్నానం ఆచరించారు. అంతకు ముందు వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవితో సహా అభిషేక సేవలు జరిపించారు. సుదర్శన చక్రతాళ్వార్‌ను పుష్కరిణిలో పవిత్ర స్నానం తర్వాత భక్తులను పుణ్యస్నానాలకు అనుమతించడం ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం వరకు చక్రస్నానం పవిత్రత ఉంటుందని టీటీడీ తెలిపింది. చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మొత్తంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవోపేతంగా నిర్వహించింది. సోమవారంతో వాహన సేవలు ఘనంగా ముగిసాయి. ఎనిమిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై వివిధ అలంకరాల్లో మలయప్పస్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు వచ్చే నెల అంటే అక్టోబర్ 15న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్దం అవుతుంది. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక.. పరమాత్మ సుదర్శన స్వామిని ముందుంచుకొని పుష్కరిణిలో తీర్థమాడుటే చక్రస్నానం. దీనినే చక్రతీర్థం అని కూడా అంటారు. బ్రహ్మోత్సవము అంటే యజ్ఞం. యజ్ఞం పూర్తిగానే అవభృధ స్నానం చేయాలి. భృధం అంటే బరువు, అవ అంటే దించుకోవడం. ఇన్ని రోజులు యజ్ఞం నిర్వహించి అలిసిపోయినవాళ్లు ఆ అలసట బరువును స్నానంతో ముగించుకుంటారు. యజ్ఞంలో పాల్గొనని వారు కూడ అవభృంధంలో పాల్గొంటే యజ్ఞ ఫలితం వస్తుందని శాస్త్ర నిర్వచనం. చక్రస్నానం నాడు సుదర్శన స్వామి, మలయప్ప స్వామితో కలిసి స్నానం చేసే మహాభాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం.