✕
Srivari Rathotsavam : వైభవంగా శ్రీవారి రథోత్సవం
By EhatvPublished on 25 Sep 2023 4:17 AM GMT
తిరుమల(Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Salakatla Brahmotsavams) ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామి(Srimalayappaswamy) రథోత్సవం(Rathotsavam) అంగరంగ వైభవంగా జరిగింది. భక్త జనసందోహం మధ్య ఉదయం 6.55 గంటలకు రథోత్సవం మొదలయ్యింది. 9.00 గంటల వరకు జరిగిన ఈ మహోత్సవంలో స్వామివారిని రథంపై ఊరేగిస్తూ తిరుమాడ వీధుల వెంట తిప్పారు.

x
Srivari Rathotsavam
-
- తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్త జనసందోహం మధ్య ఉదయం 6.55 గంటలకు రథోత్సవం మొదలయ్యింది.
-
- 9.00 గంటల వరకు జరిగిన ఈ మహోత్సవంలో స్వామివారిని రథంపై ఊరేగిస్తూ తిరుమాడ వీధుల వెంట తిప్పారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. అనాదికాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు పురాణ, ఇతిహాస గ్రంథాలు వివరిస్తున్నాయి.
-
- శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది. తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైంది. భక్తులు ప్రత్యక్షంగా పాలు పంచుకోగలిగే స్వామివారి వాహన సేవ ఇదొక్కటే కావడంతో భక్తులు వెల్లువెత్తారు.
-
- రథ సారథి దారుకుడు. సైబ్యం, సుగ్రీవం, మేఘ పుష్పం, వాలహకం రథానికి పూన్చిన గుర్రాల పేర్లు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపచేశారు. రథస్థ కేశవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అనేది శృతి వాక్యం.అంటే రథోత్సవం మోక్షప్రదాయకమన్నమాట! రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది.
-
- కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో - స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది.
-
- రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.
-
- ఇక ఈ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది.
-
- స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు.

Ehatv
Next Story