Navrathri Bramhostavm : తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు... సింహవాహనంపై ఊరేగిన శ్రీవారు
తిరుమల(Tirumala) నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Navrathri Bramhostavm) వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం స్వామివారు సింహ వాహనంపై(Simha Vahanam) ఊరేగారు. సింహవాహనంపై స్వామివారి వైభవాన్ని చూసి భక్తులు తన్మయం చెందారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీవారు సింహ వాహనాన్ని అధిరోహించారు. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు శ్రీవారికి ముత్యపు పందిరి వాహనసేవ నిర్వహించనున్నారు.

Navrathri Bramhostavm
తిరుమల(Tirumala) నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Navrathri Bramhostavm) వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం స్వామివారు సింహ వాహనంపై(Simha Vahanam) ఊరేగారు. సింహవాహనంపై స్వామివారి వైభవాన్ని చూసి భక్తులు తన్మయం చెందారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీవారు సింహ వాహనాన్ని అధిరోహించారు. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు శ్రీవారికి ముత్యపు పందిరి వాహనసేవ నిర్వహించనున్నారు. సింహవాహనాన్ని ఆధిరోహించిన సమయంలో శ్రీవారు వజ్రఖచితమైన కిరీటాన్ని ధరించారు. జంతువులకి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీక అని చెప్పచ్చు. అలాగే పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. ప్రతి మనిషిలోనూ మానవత్వంతో బాటు ఇటు మృగత్వం, అటు దైవత్వం కూడా ఉంటాయి. మనిషి తనలోని మృగత్వాన్ని జయిస్తే దైవత్వాన్ని అందుకుంటాడు. మానవత్వాన్ని పరిపూర్ణం చేసుకుంటే దేవతలనే మించిపోతాడు. మనిషి తనలోని మృగత్వాన్ని జయించేందుకు స్ఫూర్తిగా , ఆ ఉన్నతాదర్శాన్ని గుర్తు చేసేందుకే స్వామివారు సింహవాహనం మీద ఊరేగుతారని భక్తులంటారు. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహదర్శనం అతి ముఖ్యమైంది.
