Srivari Navratri Brahmotsavam : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వేదఘోష
తిరుమలలో(Tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Srivari Navratri Brahmotsavam) అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుమల నాద నీరాజనం వేదికపై ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ ఉదయం అయిదు గంటల నుంచి 5.45 గంటల వరకు వేది విద్యార్థులు చతుర్వేదాలతో వేద(Vedas) ఘోష వినిపిస్తారు.

Srivari Navratri Brahmotsavam
తిరుమలలో(Tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Srivari Navratri Brahmotsavam) అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుమల నాద నీరాజనం వేదికపై ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ ఉదయం అయిదు గంటల నుంచి 5.45 గంటల వరకు వేది విద్యార్థులు చతుర్వేదాలతో వేద(Vedas) ఘోష వినిపిస్తారు. ఉదయం 5.45 గంటల నుంచి 6.45 గంటల వరకు దేశంలోని ప్రముఖ పండితులతో వేద విజ్ఞానంపౌ సదస్సు నిర్వహిస్తారు. మహా మహోపాధ్యాయ చిర్రావూరి శ్రీరామశర్మ, వేదాంత విశారద వెంపటి కుటుంబ శాస్త్రి, డాక్టర్ అల్లాడి మోహన్, ఆచార్య చక్రవర్తి రంగనాథన్,రాణి సదాశివ మూర్తి, దేవనాథన్, కృష్ణమూర్తి వంటి వేద శాస్త్రజ్ఞులు పంచదశ మేమిగ్వే సంస్కారాలు, వేద సంబంధమైన సంస్కారాలు, వేద సంబంధమైన సంస్కారాలు, వేద సంబంధమైన సంస్కారాలు, కఠోపనిషత్, ఆధునిక శాస్త్రాలలో వేదాల ప్రాముఖ్యత తదితర అంశాలపై ఉపన్యాసించనున్నారు. అదేవిధంగా ప్రతి రోజు సాయంత్రం 4.30 గంటల నుండి 6.00 గంటల వరకు ప్రముఖ గాయకులు ఫణినారాయణ, నేమని పార్థసారధి, డాక్టర్ మోహన్ కృష్ణ, శ్రీనిధి, పవన్‌కుమార్ చరణ్, ప్రొఫెసర్ శైలేశ్వరి, శ్రీమతి రాణి శ్రీనివాస శర్మ, వాసురావు, మొదుముడి సుధాకర్, రామాచారి తమ బృందాలతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
