వివాహం జరిగి ఎన్నేళ్లయినా పిల్లలు పుట్టడం లేదా. పిల్లలు కలగడం లేదని బాధపడుతున్నారా. అయితే ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శిస్తే తప్పక సంతానం కలుగుతుందంటున్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని అక్కడే ఉన్న వృక్షానికి ఉన్న ఉయలను ఊపి సంతానం కలిగించు స్వామి అని మనఃస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా సంతానం కలుగుతందని విశ్వాసం.

కాకినాడ(Kakinada) జిల్లా సమీపన లోవకొత్తూరు(Lovakottur) గ్రామకొండ కోనల్లో శ్రీ తలంపులమ్మ అమ్మ(Sri Thalampulamma Amma) దివ్యక్షేత్రం ఉంది. ప్రకృతి ఒడిలో ఎత్తయిన కొండల మధ్యలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఈ అమ్మవారి ఆలయం వెనుక ఓ దివ్యవృక్షం ఉంది. ఈ వృక్షానికి అత్యంత పురాతన చరిత్రకలిగి ఉంది. వివాహం తర్వాత సంతానం కలగని దంపతులు వృక్షానికి ఒక బంధం కట్టి సమస్యను వివరిస్తే సంతానం కలుగుతుందని చెప్తారు. ఇదే విషయాన్ని అక్కడి అర్చకులతో పాటు సంతానం కలిగిన భక్తుల సైతం చెప్తున్నారు. అంతే కాకుండా ఈ చెట్టుకు ఒక చిన్న ఊయల ఉంది. ఈ ఊయలలో ఒక బొమ్మ మాదిరి పిల్లవాడు లేక పిల్ల మాదిరిగా ఉన్న ఒక ఆకారం ఉంటుంది. వివాహం జరిగి 20 ఏళ్లు దాటిన వారికి కూడా ఇలా చేయడంతో సంతానం కలిగిందని అర్చకులు చెప్తున్నారు. ఈ దివ్య క్షేత్రానికి చేరుకోవాలంటే విశాఖ నుంచి రాజమండ్రి వెళ్లే రహదారిలో మధ్యలో లావ కొత్తూరు జాతీయ రహదారి ఉంటుంది. ఈ జాతీయ రహదారి గుండా దాదాపు 8 కి.మీ. కుడిపక్క లోపలికి వెళ్తే ఈ దివ్య క్షేత్రం దర్శనం జరుగుతుంది.

Updated On 10 Feb 2024 5:54 AM GMT
Ehatv

Ehatv

Next Story