Salakatla Brahmotsavam : సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప..
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో(Salakatla Brahmotsavam) నాలుగో రోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి(Malayappaswamy) సర్వభూపాల వాహనంపై(Sarvabhupalas vehicle) వేణుగోపాలకృష్ణుడి(Krishna) అలంకారంలో దర్శనమిచ్చారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో(Salakatla Brahmotsavam) నాలుగో రోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి(Malayappaswamy) సర్వభూపాల వాహనంపై(Sarvabhupalas vehicle) వేణుగోపాలకృష్ణుడి(Krishna) అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.