శ్యామ‌లపై(shyamala) ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెంచుకునేవారు ఎక్కువతున్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధికార ప్ర‌తినిధిగా నియ‌మితులైన యాంక‌ర్ శ్యామ‌లపై(shyamala) ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెంచుకునేవారు ఎక్కువతున్నారు. ప్రెస్‌మీట్‌లలో ఆమె కనబరుస్తున్న వాగ్ధాటి చూస్తే ముచ్చటేస్తున్నది. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విధానం ఆకట్టుకుంటోంది. ఇదే ఆమెకు సమస్య అవుతోంది. శ్యామలకు పార్టీ అధిష్టానం విపరీత ప్రాధాన్యం ఇవ్వడాన్ని భరించలేకపోతున్నారు. శ్రీరెడ్డి(sree reddy) కూడా తనలో ఉన్న అసంతృప్తిని చాటుకుంటూ పరోక్షంగా శ్యామలను దెప్పిపొడిచారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన తమకు మాత్రం ఎలాంటి పదవులు ఇవ్వలేదని, నిన్నగాక మొన్న వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారని శ్రీరెడ్డి అన్నారు. ఎంతో మందితో తిట్లు తింటూ, ట్రోల్‌కు గురవుతూ, అరెస్ట్‌ అవుతూ ఉన్న తనలాంటి వారు జగన్‌కు(YS jagan) కనిపించడం లేదని చెప్పారు శ్రీరెడ్డి.

Eha Tv

Eha Tv

Next Story