వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నేడు మరోసారి నోటీసులు పంపారు.

వైసీపీ(YSRCP) రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(KotamReddy Sridhar Reddy), ఉండవల్లి శ్రీదేవి(Undavalli Sridevi), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(Mekapati Chandrashekar Reddy)లకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Thammineni Seetharam) నేడు మరోసారి నోటీసులు పంపారు. బహిష్కృత ఎమ్మెల్యేలకు ఇదివరకే పలుమార్లు నోటీసులు పంపారు. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, స్పీకర్ విచారణ చేపట్టారు. ఫిబ్రవరి 8న విచారణకు పిలవగా, వైసీపీ రెబెల్స్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబెల్స్‌కు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇచ్చారు. ఈ నెల 12వ తేదీన అనర్హత పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టనున్నారు. అనర్హత నోటీసుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాంను వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలిసారు. స్పీకర్ తో పర్సనల్ హియరింగ్ కు హాజరుకావడం రెండోసారి అని కూడా ఆయన తెలిపారు. మొదటి సారి హాజరైనప్పుడు చాలా వివరాలు అడిగారనీ, అవన్నీ తాను చెప్పినట్లు ఆనం వివరించారు.

Updated On 9 Feb 2024 9:21 PM GMT
Yagnik

Yagnik

Next Story