KC Venugopal : విలీనం లాంఛనమే.. షర్మిల భర్త అనిల్‍కు కేసీ వేణుగోపాల్ ఫోన్..!
కాంగ్రెస్(Congress) పార్టీలో వైఎస్‍ఆర్(YSR) తెలంగాణ పార్టీ విలీనం లాంఛనమేనని తెలుస్తోంది. విలీనం విషయమై ఏఐసీసీ(AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venu Gopal).. వైఎస్‍ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల(Sharmila) భర్త అనిల్‍కు(Anil) ఫోన్ చేసి మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్(Congress) పార్టీలో వైఎస్‍ఆర్(YSR) తెలంగాణ పార్టీ విలీనం లాంఛనమేనని తెలుస్తోంది. విలీనం విషయమై ఏఐసీసీ(AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venu Gopal).. వైఎస్‍ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల(Sharmila) భర్త అనిల్‍కు(Anil) ఫోన్ చేసి మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో(Sonia Gandhi) ఇవాళ లేదా రేపు విజయమ్మ(Vijayamma), షర్మిల(sharmila) చర్చలు జరిపే అవకాశముందని సమాచారం. ఆపై సోనియా(sonia), రాహుల్ గాంధీ(Rahul Gandhi) జులై 8న ఇడుపులపాయకు రానున్నారని తెలుస్తోంది. ఇడుపులపాయలో(Idupulapaya) సోనియా, రాహుల్ వైఎస్సార్ కు నివాళులర్పించనున్నారని సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకున్నారు. తండ్రి కోరిక నెరవేర్చేందుకు కాంగ్రెస్ వైపు షర్మిల అడుగులు వేస్తున్నారని.. లేదు.. జగన్ టార్గెట్‍గా కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.