Kidnap In Public : కలకలం రేపిన కిడ్నాప్ ఘటన.. అందరూ చూస్తుండగానే..
ఎన్టీఆర్ జిల్లా(NTR District) ఇబ్రహీంపట్నంలో(Ibrahimpatnam) కిడ్నాప్(Kidnap) ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాళ్లోకెళితే.. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో కొందరు ఓ యువకుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అందరూ చూస్తుండగానే యువకుడిపై దాడి చేసి బలవంతంగా అతడిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. భయాందోళనకు గురైన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమతమై ఛేదించారు.

Kidnap In Public
ఎన్టీఆర్ జిల్లా(NTR District) ఇబ్రహీంపట్నంలో(Ibrahimpatnam) కిడ్నాప్(Kidnap) ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాళ్లోకెళితే.. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో కొందరు ఓ యువకుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అందరూ చూస్తుండగానే యువకుడిపై దాడి చేసి బలవంతంగా అతడిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. భయాందోళనకు గురైన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమతమై ఛేదించారు. కారు, యువకులను అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి.. డబ్బులు తీసుకుని మోసం చేయడంతో కిడ్నాప్‌కు పాల్పడినట్లు సమాచారం. గంపలగూడెం(Gampala Gudem) మండలం వినగడపకు చెందిన ఒక వ్యక్తి ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన వారి వద్ద నుంచి 28 లక్షల వరకూ వసూళ్ళు చేసినట్లు చెబుతున్నారు. ఉద్యోగాలు ఇప్పించాలని డబ్బులు ఇచ్చిన వారు కోరడంతో కొద్ది రోజులుగా మొఖం చాటేస్తున్నాడు. ఈ క్రమంలోనే డబ్బులు ఇవ్వాలని కోరగా.. స్పందన లేకపోవడంతో కిడ్నాప్‌కు యత్నించినట్లు తెలుస్టోంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
