ఈ నెల 29 నుంచి మే 7వ తేదీ వరకు పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను(express trains) రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆధునికీకరణ, భద్రతా పనుల కారణంగా పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

ఈ నెల 29 నుంచి మే 7వ తేదీ వరకు పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను(express trains) రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆధునికీకరణ, భద్రతా పనుల కారణంగా పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని(anhra pradesh) దువ్వాడ రైల్వేస్టేషన్‌లో(dhuwada Raiway station) ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ఈ నెల 29 నుంచి మే 7వ తేదీ వరకు పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్ల‌డించింది.

ఈ నెల 29, మే 6 తేదీల్లో సికింద్రాబాద్‌ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 30, మే 7 తేదీల్లో విశాఖ – సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే మే 5, 6 తేదీల్లో కాచిగూడ – విశాఖపట్నం, మే 6, 7 తేదీల్లో విశాఖపట్నం – కాచిగూడ రైలును నిలిపివేస్తున్నట్లు వెల్ల‌డించింది. 6న బిలాస్‌పూర్‌ – తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు, 6న సికింద్రాబాద్‌ – విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రద్దు, 7న విశాఖ – సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు వివరించింది. మార్పును గ‌మ‌నించి ప్రయాణికులు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

Updated On 28 April 2023 6:14 AM GMT
Ehatv

Ehatv

Next Story