Ratna Madhuri : ప్రియుడిని నమ్మి ప్రాణాలు విడిచిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
తొమ్మిది రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం జరిపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రత్నమాధురి(Ratna madhuri) ఓటమిపాలయ్యారు. ఆమె కోలుకుంటుందని అనుకున్న కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు నిరాశ మిగిల్చి కన్నుమూశారు. తన సహోద్యోగి నాతవరం మండలం వెన్నలపాలేంకు చెందిన వాసిరెడ్డి శేఖర్(Vasi Reddy shekar) కారణంగానే 26 ఏళ్ల రత్నమాధురి చనిపోయిందన్నది ఆమె బంధువుల ఆరోపణ.
తొమ్మిది రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం జరిపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రత్నమాధురి(Ratna madhuri) ఓటమిపాలయ్యారు. ఆమె కోలుకుంటుందని అనుకున్న కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు నిరాశ మిగిల్చి కన్నుమూశారు. తన సహోద్యోగి నాతవరం మండలం వెన్నలపాలేంకు చెందిన వాసిరెడ్డి శేఖర్(Vasi Reddy shekar) కారణంగానే 26 ఏళ్ల రత్నమాధురి చనిపోయిందన్నది ఆమె బంధువుల ఆరోపణ. శేఖర్ ప్రేమిస్తున్నానని చెబితే పాపం రత్నమాధురి నమ్మేసింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన వాడుమోసం చేశాడని తెలిసి తల్లడిల్లిపోయింది. పెద్దలు వెళ్లి శేఖర్ బంధువులతో పెళ్లి గురించి మాట్లాడారు. అయినా అతడు వినలేదు. జనవరి 27వ తేదీన శేఖర్‌తో కలిసి రత్నమాధురి వైజాగ్(Vizag) వెళ్లింది. ఆ రాత్రే రత్నమాధురిని శేఖర్ నర్సీపట్నం తీసుకువచ్చి ఆమె ఇంట్లో దించేసి వెళ్లిపోయాడు. తర్వాతి రోజు నుంచి రత్నమాధురి తీవ్ర అస్వస్థతకు లోనయ్యింది. నర్సీపట్నం, విశాఖ హాస్పిటల్స్‌లో చికిత్స చేయించినా కోలుకోలేదు. తన కూతురుపై విష ప్రయోగం జరిగి ఉండవచ్చని రత్నమాధురి తల్లి అమ్మాజీ ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సుధాకర్ విశాఖ ఆసుపత్రికి వెళ్లి మాధురి కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులతో మాట్లాడారు. రత్నమాధురి, శేఖర్‌లు దాదాపు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారని వారి చెప్పారు.