ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు(AP high court) అక్రమ కేసులపై(Illegal cases) ఆగ్రహించినప్పటికీ కూటమి ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు(AP high court) అక్రమ కేసులపై(Illegal cases) ఆగ్రహించినప్పటికీ కూటమి ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YSRCP) చెందిన జల్లా సోషల్‌ మీడియా(Social media) కన్వీనర్లందరిపైనా కేసులు పెట్టింది. సోషల్‌ మీడియాలో తెలుగుదేశం(TDP), జనసేన(Janasena) పార్టీల నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారాలు చేసినందుకుగానే కేసులు పెట్టామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏ1గా స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డి(Sajjala Bhargav reddy), ఏ2గా మ‌హేశ్‌(Mahesh), ఏ3గా వీరారెడ్డి(Veera reddy) (ఏపీ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్‌), ఏ4గా భ‌గ్గు జ‌య‌రామ్(Baggu jay ram) (భీమ‌వ‌రం), ఏ5గా గుర్రంపాటి దేవేంద‌ర్‌రెడ్డి, ఏ6గా క‌మ‌టం మ‌హేశ్‌, ఏ7గా ప‌ట్లూరి శ్రీ‌నివాసు, ఏ8గా నిరంజ‌న్‌…మొత్తంగా 33 మందిపై కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసులతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా యాక్టివిస్టులు(Activist) వణికిపోతున్నారు. సజ్జల భాస్కర్‌పై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన తర్వాత సోషల్‌ మీడియా యాక్టివిస్టులు భయపడిపోతున్నారు. ఏ పోస్టు పెడితే ఏమవుతుందోనన్న భయాందోళన వారిని వెంటాడుతోంది. అక్రమ కేసులు న‌మోదు చేసే పోలీసుల‌పై ప్రైవేట్ కేసులు న‌మోదు చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుకుంటోంది.

Eha Tv

Eha Tv

Next Story