రోహిణీ కార్తె ఇంకా రానేరాలేదు కానీ అప్పుడే ఎండలకు రోళ్లు పగులుతున్నాయి. దంచి కొడుతున్న ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. తీవ్రమైన వడగాడ్పులు ప్రాణాలు తోడేస్తున్నాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతుందన్న వార్త మరింత భయపెడుతోంది.

రోహిణీ కార్తె ఇంకా రానేరాలేదు కానీ అప్పుడే ఎండలకు రోళ్లు పగులుతున్నాయి. దంచి కొడుతున్న ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. తీవ్రమైన వడగాడ్పులు ప్రాణాలు తోడేస్తున్నాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతుందన్న వార్త మరింత భయపెడుతోంది. జూన్‌ 4వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ(kerala) తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ ఒకటి నాటికి కేరళలో ప్రవేశిస్తాయి. ఈ ఏడాది మాత్రం వాటి రాక నాలుగు రోజులు ఆలస్యమవుతోంది.

లాస్టియర్ మే 29 నాటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 2021లో జూన్‌ 3వ తేదీన, 2020లో జూన్‌ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఎల్‌ నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ దేశంలో ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈనెల 19 నుంచి వేడి వాతావరణంతో పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది.

Updated On 16 May 2023 7:07 AM GMT
Ehatv

Ehatv

Next Story