ఎమ్మెల్యే కోటా(MLA Quota)లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) పోలింగ్‌లో క్రాస్‌ ఓటింగ్‌(Cross Voting)కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP). విప్‌ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) తెలిపారు.

ఉండవల్లి శ్రీదేవి(Undavalli Sridevi), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(Mekapati Chandrasekhar Reddy), ఆనం రాంనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy),కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy)పై వేటు వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేసినట్టు పార్టీ గుర్తించిందని సజ్జల చెప్పారు. క్రాస్‌ ఓటింగ్‌పై అంతర్గత విచారణ జరిపిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నామన్నారు.

తమ ఎమ్మెల్యేలను చంద్రబాబు(Chandrababu) డబ్బులిచ్చి కొన్నారని, తమకున్న సమాచారం ప్రకారం డబ్బులు చేతులు మారాయని సజ్జల తెలిపారు. ఒక్కోక్కొరికి 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు చంద్రబాబు ఆఫర్‌ చేశారని, క్రాస్‌ ఓటింగ్‌ చేసినవాళ్లకు టికెట్‌ కూడా ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పి ఉండవచ్చునని సజ్జల వివరించారు

Updated On 24 March 2023 6:59 AM GMT
Ehatv

Ehatv

Next Story