మరి కొద్ది రోజుల్లో ఆంధప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు(AP Assembly Elections) జరగబోతున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో రాష్ట్రం హోరెత్తనుంది. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. కొందరు ఆల్‌రెడీ ప్రచారంలో దిగిపోయారు కూడా! ఈసారి 175 అసెంబ్లీ స్థానాలకు వందలాది మంది పోటీపడుతున్నారు.

మరి కొద్ది రోజుల్లో ఆంధప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు(AP Assembly Elections) జరగబోతున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో రాష్ట్రం హోరెత్తనుంది. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. కొందరు ఆల్‌రెడీ ప్రచారంలో దిగిపోయారు కూడా! ఈసారి 175 అసెంబ్లీ స్థానాలకు వందలాది మంది పోటీపడుతున్నారు. రాజకీయ నాయకులతో పాటుగా సెలెబ్రిటీలు, బిజినెస్‌మన్‌లు, ప్రొఫెషనల్స్‌, జర్నలిస్టులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. చెప్పుకోదగిన విషయమేమింటే ముఖ్యమంత్రులుగా పని చేసిన వారి కుమారులు ఆరుగురు ఈసారి ఎన్నికల బరిలో దిగడం! వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుమారుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాలను గెల్చుకున్నారు. ఇప్పుడు మరోసారి తనను ఆశీర్వదించాలని ప్రజలను వేడుకుంటున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆయన పులివెందుల(Pulivendula) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. జగన్‌ ఇప్పటికే కడప(Kadapa) నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2019లో మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పడు హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యారు.

తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌.టి.రామారావు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) మరోసారి హిందూపూర్‌(Hindhupur) నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా రెండు సార్లు గెలిచిన బాలకృష్ణ మూడోసారి తనను గెలిపించాల్సిందిగా ప్రజలను వేడుకుంటున్నారు. నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌(Ap)కు ముఖ్యమంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్‌(Nadendla Manohar)కు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది. ఈసారి ఆయన జనసేన పార్టీ(Jaansena Party) తరఫున తెనాలి(Tenali)లో పోటీ చేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress) తరపున విజయం సాధించిన మనోహర్‌ కొంతకాలం అసెంబ్లీ స్పీకర్‌(Assembly Speaker)గా కూడా పని చేశారు. ఇక 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu) కుమారుడు లోకేశ్‌(Nara Lokesh) మంగళగిరి(Mangalagiri) నుంచి మరోసారి పోటీకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఇదే మంగళగిరిలో ఆయన ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. మరో ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌(Ramkumar) వేంకటగిరి(Vankatagiri) నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.ఎన్నికల్లో పోటీ చేయడం ఈయనకు ఇదే మొదటిసారి. గతంలో ఆయన తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఇక్కడ నుంచి గెలిచారు. విద్యాశాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఇంకో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుమారుడు సూర్యప్రకాశ్‌రెడ్డి(Suryaprakash reddy) తెలుగుదేశం పార్టీ తరఫున డోన్‌లో పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో అంటే 1991, 2004, 2009 ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో రైల్వే శాఖ సహాయమంత్రిగా కూడా పని చేశారు. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సూర్యప్రకాశ్‌ రెడ్డి ఇప్పుడు టీడీపీలో ఉన్నారు.

అయితే, తాత, తండ్రుల పేర్లు చెప్పుకుని గెలిచే రోజులు కావివి.. నువ్వేమిటి.. సమాజానికి నువ్వేం చేసావ్.. నువ్వేం చేస్తావ్ అని చెప్పుకుంటే తప్ప ప్రజామోదం దక్కని రోజులివి. మరిప్పుడు వీళ్ళలో ఎవరిని ప్రజలు ఆదరిస్తారో.. ఆరాధిస్తారో చూడాలి.

Updated On 21 March 2024 6:25 AM GMT
Ehatv

Ehatv

Next Story