తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు వచ్చిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో

తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు వచ్చిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో ప్రపంచంలో ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు వస్తున్నాయి. సీబీఐ(CBI) లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని వైసీపీ(YCP)కోరుతోంది. ఈ మేరకు ప్రధానికి, సుప్రీంకోర్టుకు కూడా జగన్‌ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ అంశంపై విచారించేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్‌ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని(Sarvashrestha Tripathi) నియమించింది. ప్రస్తుతం గుంటూరు రేంజ్‌ డీఐజీగా త్రిపాఠి ఉన్నారు.

ehatv

ehatv

Next Story