ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి కేసు విచారణ చేసేందుకు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి కేసు విచారణ చేసేందుకు సిట్ ఏర్పాటు చేసినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా తెలిపారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ పని చేయనున్నట్లు తెలిపారు. జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.

సంఘటన స్థలంలో ఉన్న వాళ్లను విచారించేందుకు ప్రయత్నాలు చేశామని తెలిపారు. అజిత్ సింగ్ నగర్ లో ఉన్న మూడు సెల్ ఫోన్ టవర్స్ నుంచి డంపు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు 20,000 సెల్ ఫోన్లు అక్కడ యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించారు. సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు అధికారులు.

జగన్ రూట్ మ్యాప్ లో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సంఘటన ప్రాంతంలో ఉన్న ఇల్లు, కమర్షియల్ కాంప్లెక్స్ యజమానులను ప్రశ్నిస్తున్నారు అధికారులు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా సంచరించారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ తో పాటు ప్రత్యేక దర్యాప్తు బృందాల చేత కూడా విచారణ చేయిస్తున్నారు.

Updated On 14 April 2024 9:40 PM GMT
Yagnik

Yagnik

Next Story