అనకాపల్లి(anakapalli) సింహాద్రి అప్పన్న(Simhadri Appanna) స్వామి తొలి గంధం అరగతీతకు ముహూర్తం ఖరారయ్యింది. 4వ తేదీన అంటే శనివారం చైత్ర బహుళ ఏకాదశి రోజున తొలి గంధం అరగతీతకు దేవస్థానం నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టనున్నారు.

అనకాపల్లి(anakapalle) సింహాద్రి అప్పన్న(Simhadri Appanna) స్వామి తొలి గంధం అరగతీతకు ముహూర్తం ఖరారయ్యింది. 4వ తేదీన అంటే శనివారం చైత్ర బహుళ ఏకాదశి రోజున తొలి గంధం అరగతీతకు దేవస్థానం నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం ఏడు గంటలకు స్వామి వారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత ఆలయ నిర్వాహకులు చందన సాన ముహూర్తం నిర్వహించి
తొలి గంథం చెక్క అరగ తీయటం ప్రారంభిస్తారు.అనంతరం ఆలయంలో సానలపై భక్తులు అందరూ చందనం అరగదీస్తారు. మే 4వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు ఆలయ సమయంలో భక్తులు అందరూ చందనం అరగదీస్తారు. మే 10వ తేదీన అత్యంత వైభవంగా చందనోత్సవం అంటే నిజ రూప దర్శనం జరుగుతుంది..

Updated On 4 May 2024 1:12 AM GMT
Ehatv

Ehatv

Next Story