బాలయ్య ఈవెంట్‌కు బన్నీకి ఆహ్వానం !

నందమూరి బాలకృష్ణ(Nandhamuri balakrishna) ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు(Allu arjun) ప్రత్యేక ఆహ్వానం(Special invitation) అందింది. బాలయ్య నట ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని టాలీవుడ్‌ నిర్ణయించింది. ప్టెంబర్‌ 1న హైదరాబాద్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించునున్నారు. ఈ వేడులకు హాజరు కావాలంటూ టీఎఫ్‌పీసీ(TFPC), టీఎఫ్‌సీసీ(TFCC), మా అసోసియేషన్‌(MAA) సభ్యులు బన్నీని కలిసి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతోంది. ఇదే సమయంలో బన్నీ ఫ్యాన్స్‌ తెగ సంబరపడుతున్నారు. ఇది ఓ రకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు(Pawan kalyan) షాక్‌ లాంటిదేనని కామెంట్‌ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో జనసేన కూడా ఉన్న విషయం తెలిసిందే. బాలయ్యనేమో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఈ లెక్కన ప్రత్యేక ఆహ్వానితులుగా పవన్‌ను పిలవకుండా అల్లు అర్జున్‌ను పిలిచారంటేనే తమ స్టార్‌ రేంజ్‌ ఎంతటిదో తెలుసుకోవాలని బన్నీ ఫ్యాన్స్‌ అంటున్నారు. తమిళ నటులు విజయ్‌ సేతుపతి, శివ కార్తికేయన్‌, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌లకు కూడా బాలయ్య ఈవెంట్‌కు ఆహ్వానం అందింది. కొన్ని రోజుల క్రితమే చిరంజీవి తదితరులను వేడుకకు ఆహ్వానించారు సినీ ప్రముఖులు.

Updated On 29 Aug 2024 6:15 AM GMT
Eha Tv

Eha Tv

Next Story