Raja Reddy : షర్మిల కొడుకును చూశారా..? 'కటౌట్' మాములుగా ఉండదు..!
నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. తండ్రికి నివాళి అర్పించేందుకు సీఎం జగన్ ఈ మధ్యాహ్నం కడపకు బయలుదేరనున్నారు. ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఇడుపుల పాయకు చేరుకున్నారు.

Sharmila’s son’s photo goes viral on social media
నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy) జయంతి. ఈ సందర్భంగా ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. తండ్రికి నివాళి(Tribute) అర్పించేందుకు సీఎం జగన్(CM Jagan) ఈ మధ్యాహ్నం కడపకు బయలుదేరనున్నారు. ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఇడుపుల పాయకు చేరుకున్నారు. అయితే వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల(YS Sharmila), ఆమె తనయుడు రాజారెడ్డి(Rajareddy) విమానం దిగుతున్న ఫోటోలు నెట్టింట వైరల్(Viral) అవుతున్నాయి.
కటౌట్ చూడు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు #వైఎస్_రాజారెడ్డి 🔥🔥 #JrYSR #YSRajaReddy #YSR
Hope of #YSR Fans for #Next_Generation
తాత వైఎస్సార్ గారికి నివాళి అర్పించేందుకు విదేశాల నుండి కడప చేరుకున్న మా వైఎస్ రాజరెడ్డి, పేరులోనే కాదు, గుణం లో కూడా ముత్తాత రాజారెడ్డి గారిని, తాత… pic.twitter.com/oJ9G7u7KGU
— Ravindra Reddy Ippala (@ravindra_ippala) July 7, 2023
రవీందర్ రెడ్డి ఇప్పాల అనే రాజశేఖర్ రెడ్డి అభిమాని ఈ ఫోటోలు షేర్ చేశాడు. షర్మిల కొడుకు రాజారెడ్డి ఫోటోను షేర్ చేస్తూ.. కటౌట్ చూడు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు.. వైఎస్ రాజారెడ్డి.. వైఎస్ అభిమానుల తరవాతి తరం ఆశ.. తాత వైఎస్సార్ కి నివాళి అర్పించేందుకు విదేశాల నుండి కడప(Kadapa) చేరుకున్న మా వైఎస్ రాజరెడ్డి.. పేరులోనే కాదు.. గుణం లో కూడా ముత్తాత రాజారెడ్డిని, తాత వైఎస్సార్ కి ఏమాత్రం తీసిపోడని ట్వీట్(Tweet) చేశాడు.
ఈ ట్వీట్‌పై రాజశేఖర్ రెడ్డి అభిమానులు, జగన్ ఫ్యాన్స్, షర్మిల అనుచరులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. తాతకు తగ్గ మనవడు అవుతాడని కొందరు.. సీఎం జగన్‌కు రాజారెడ్డి అల్లుడవుతారు.. ఆ కోణంలో అల్లుడు అదుర్స్ అంటూ కొందరు.. కటౌట్ సాలిడ్‌గా ఉందని ఇంకొందరూ కామెంట్లు చేస్తున్నారు.
