కాంగ్రెస్ నాయ‌కురాలు వైఎస్ షర్మిల నేడు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు.

కాంగ్రెస్ నాయ‌కురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) నేడు టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)ను కలవనున్నారు. వైఎస్ షర్మిలా రెడ్డి శ‌నివారం ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఆయన నివాసంలో కలుస్తారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి(YS Rajareddy) వివాహ ఆహ్వాన పత్రిక(Wedding Invitation)ను అందించి.. పెళ్లికి ఆహ్వానించ‌నున్నారు.

ఇదిలావుంటే.. ష‌ర్మిల ఇటీవ‌ల కాంగ్రెస్‌(Congrss)లో చేరిన నేప‌థ్యంలో.. ఆమె చేరిక వెన‌క చంద్రబాబు ఉన్నార‌ని వైసీపీ(YCP) విమ‌ర్శలు చేసింది. షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచైనా ప్రాతినిథ్యం వహించవచ్చని వైసీపీ ముఖ్య‌నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఏపీలో భవిష్యత్తు లేదని.. కాంగ్రెస్‌ పార్టీని తాము పట్టించుకోబోమని పేర్కొన్నారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. ఈ క్ర‌మంలో చంద్రబాబు, ష‌ర్మిల భేటీలో రాజ‌కీయ అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తాయా లేక ఆహ్వాన ప‌త్రిక అంద‌జేయ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మా అనే ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి.

Updated On 12 Jan 2024 10:47 PM GMT
Yagnik

Yagnik

Next Story