ఇప్పుడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. Y అంటే YV సుబ్బారెడ్డి.. S అంటే సాయిరెడ్డి.. R అంటే రామకృష్ణా రెడ్డి అని కొత్త అర్ధం చెప్పారు.

ఇప్పుడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) కాదని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. Y అంటే YV సుబ్బారెడ్డి.. S అంటే సాయిరెడ్డి.. R అంటే రామకృష్ణా రెడ్డి అని కొత్త అర్ధం చెప్పారు. మీ పార్టీలో YSR లేడని వైసీపీ(YCP)ని ఉద్దేశించి ఆమె వ్యాఖ్య‌లు చేశారు. మీది జగన్ రెడ్డి పార్టీ.. నియంత పార్టీ.. ప్రజలను పట్టించుకోని పార్టీ అని విమ‌ర్శించారు. ప్రకాశం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఆమె మీడియాతో మాట్లాడారు.

వైసీపీ.. ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ అని మండిప‌డ్డారు. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టని పార్టీ అన్నారు. నా పై ముప్పేట దాడి చేస్తున్నారు. అన్నివైపుల నుంచి దాడి చేస్తున్నారు. నా సొంత వాళ్ళు అనుకుని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశా.. నా బిడ్డలను ఇంటిని పక్కన పెట్టానన్నారు. వైసీపీని నా భుజాల మీద వేసుకున్న.. మనసు పెట్టి పని చేశాన‌ని పేర్కొన్నారు.

వైసీపీ కోసం నా రక్తం దారపోశా.. నా చెమటను దారపోశాన‌ని.. అదే వైసీపీ ఇప్పుడు నా మీద దాడి చేస్తుందన్నారు. నా మీద ఎన్ని రకాలుగా దాడులు చేసిన నేను భయపడన‌న్నారు. ఇక్కడున్నది వైఎస్సార్ బిడ్డ.. భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు. మీకు చేతనయ్యింది చేసుకోండి.. నేను రెడీ.. ఈ యుద్ధానికి మేము రెడీ.. అని కాంగ్రెస్(Congress) శ్రేణుల‌ను స‌న్న‌ద్ధం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి హోదా రావాలి.. ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం కావాలన్నారు. విశాఖ స్టీల్ ఉండాలి.. ఉద్యోగాలు రావాలన్నారు. ఏపీ(AP)లో రైతు రాజ్యం రావాలి.. అందుకే వైఎస్సార్ బిడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టిందన్నారు.

Updated On 27 Jan 2024 2:58 AM GMT
Yagnik

Yagnik

Next Story