కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో APCC చీఫ్. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ముఖాముఖి నిర్వ‌హించారు.

కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో APCC చీఫ్. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ముఖాముఖి నిర్వ‌హించారు. ఉపాధి హామీ కూలీల కష్టాలు ఆమె అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కింద ఎటువంటి వసతుల కల్పన లేదని.. రోజంతా కష్టపడ్డా 200 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని కూలీలు షర్మిల దృష్టికి తీసుకు వచ్చారు. కూలీలకు భరోసా నింపేందుకు తాను సైతం పలుగు, పార పట్టి మట్టి తవ్వారు.

ఈ సంద‌ర్భంగా వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరు గార్చాయన్నారు. పొద్దంతా పని చేస్తే ఇచ్చే వేతనం 200 కన్నా మించడం లేదన్నారు. వృద్దులకు 150 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ హయాంలో YSR ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం పండుగలా సాగిందన్నారు.

కూలీలకు పనితో పాటు వసతుల కల్పన కూడా ఉండేదని.. ఇప్పుడు కనీసం మంచినీరు కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం 400 రూపాయలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. జగన్ బటన్ నొక్కుతున్నా అని చెప్పి ఉన్నది గుంజుకున్నాడని.. ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి.. మరో చేత్తో వెండి చెంబు తీసుకున్నార‌ని ఆరోపించారు.

Updated On 7 May 2024 1:31 AM GMT
Yagnik

Yagnik

Next Story