Trains Cancelled : నేటి నుంచి పలు రైళ్లు రద్దు
నేటి నుంచి పలు రైలు సర్వీసులు రద్దుచేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. నెల్లూరు, విజయవాడ-గూడూరు డివిజన్‌లో మూడోలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా బుధవారం నుంచి పలు రైళ్లు రద్దు చేసినట్లు నెల్లూరు రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఎస్.వి.ఎన్. కుమార్ పేర్కొన్నారు.

Several trains cancelled, Check list
నేటి నుంచి పలు రైలు(Trains) సర్వీసులు రద్దు(Cancelled) చేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. నెల్లూరు, విజయవాడ-గూడూరు డివిజన్‌లో మూడోలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా బుధవారం నుంచి పలు రైళ్లు రద్దు చేసినట్లు నెల్లూరు(Nellore) రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఎస్.వి.ఎన్. కుమార్(SVN Kumar) పేర్కొన్నారు.
1. 10 నుంచి 15 వరకు నెల్లూరు-సూళ్లూరుపేట-నెల్లూరు మెమో రైళ్లు రద్దు
2. 10 నుంచి 15 వరకు విజయవాడ-గూడూరు-విజయవాడ పాసింజర్ రైళ్లు రద్దు
3. 10 నుంచి 15 వరకు గూడూరు-రేణిగుంట-గూడూరు మెమో రైళ్లు రద్దు
4. 10 నుంచి 15 వరకు విజయవాడ-చెన్నై-విజయవాడ పినాకిని ఎక్స్‌ప్రెస్‌లు రద్దు
5. 10 నుంచి 14 వరకు విజయవాడ-చెన్నై-విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రద్దు
6. 10, 11, 14, 15 తేదీల్లో బిట్రగుంట-చెన్నై-బిట్రగుంట పాసింజర్ రద్దు
7. 10 నుంచి 15 వరకు తిరుపతి-కాకినాడ పాసింజర్ రద్దు
8. 11 నుంచి 16 వరకు కాకినాడ-తిరుపతి పాసింజర్ రద్దు
9. 9, 11, 13 తేదీల్లో తిరుపతి-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు
10. 10, 12, 14 తేదీల్లో విశాఖపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రద్దు
11. 14న విశాఖపట్నం-చెన్నై ఎక్స్‌ప్రెస్ రద్దు
12. 15న చెన్నై-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు
