floods in vijayawada

కృష్ణానది, బుడమేరు వాగు, ఇతర వాగుల్లో నీటి మట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ, విజయవాడలోని పలు ప్రాంతాలు ఇంకా వరద ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. అధికారులు ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, ఏలూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటి వరకు 193 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 42,707 మందికి వసతి కల్పించారు.

మొత్తం 48 ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సేవలందించగా, ఆరు హెలికాప్టర్‌లు నేవీ నుండి రెండు, ఎయిర్ ఫోర్స్ నుండి నాలుగు -- ఆహార పదార్థాలను ఎయిర్‌డ్రాప్ చేస్తున్నాయి. నీటిలో చిక్కుకున్న ప్రజలను ఎయిర్‌లిఫ్టింగ్ చేస్తున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 228 బోట్లను మోహరించగా, 315 మంది ఈతగాళ్లతో పాటు రెస్క్యూ ఆపరేషన్ల కోసం నిమగ్నమై ఉన్నారు. APSRTC చుట్టుపక్కల రైల్వే స్టేషన్ల నుండి విజయవాడకు ప్రయాణీకులను తరలించడానికి, ఇతర సహాయక చర్యల కోసం 167 బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రైల్వే శాఖ 328 రైళ్లను రద్దు చేయగా, 174 రైళ్లను దారి మళ్లించింది, 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత ప్రజలతో మమేకమై వారికి సకాలంలో ఆహారం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన చాపర్‌లు బాధిత ప్రజలకు తాగునీటి ప్యాక్‌లు, బిస్కెట్లు, ఆహార పదార్థాలు, మందులను పంపిణీ చేశాయి.


Sreedhar Rao

Sreedhar Rao

Next Story