ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సినీ నటుడు సుమన్ తన మనసులో మాటను బయటపెట్టారు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సినీ నటుడు సుమన్ తన మనసులో మాటను బయటపెట్టారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై సుమన్ తన అంచనాను వెల్లడించారు. తిరుపతి తాతయ్యగుంటలోని గంగమ్మ అమ్మవారిని ఆదివారం సుమన్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు సుమన్. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేక ఏ పార్టీకైనా మద్దతు పలుకుతారా అని మీడియా ప్రశ్నించగా రాజకీయ పరంగా పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు సీనియర్‌ సిటిజన్స్‌కు ప్రాధాన్యత కల్పిస్తూ మేనిఫెస్టో అందించే పార్టీకి తన సంపూర్ణ సహకారం ఉంటుందని సుమన్‌ చెప్పారు. రాజకీయం అంటే పదవులు చేపట్టడం కాదని, ప్రజల సంక్షేమం దిశగా ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజాదరణ పొందినప్పుడే ప్రజా నాయకులు అవుతారని, ఎంత కష్టమైనా ఇచ్చి­న హామీలు నెరవేర్చి ప్రజల కోసం శ్రమించే వారికే పట్టం కడతారని అన్నారు.

రాజకీయాల్లో చంద్రబాబును తన గురువుగా సుమన్ అభివర్ణించారు. గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీగా తనను పోటీ చేయించాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే అందుకు తాను సుముఖత చెప్పలేదని చెప్పుకొచ్చారు. తనపై నమ్మకంతో ఎంపీ చేయాలనుకున్నారని.. అందుకు తాను చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతున్నట్లు సుమన్ చెప్పారు. తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని సుమన్ తెలిపారు.. రాజకీయ ఆలోచనలతో విజయ్ అడుగులు వేస్తున్నారని అన్నారు.

Updated On 19 Feb 2024 12:18 AM GMT
Yagnik

Yagnik

Next Story