janasena Mlas : జనసేన ఎమ్మెల్యేల రహస్య భేటీ..!!
జనసేన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో తమకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని

జనసేన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో తమకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని, అధికారులు తమ మాట వినడం లేదని అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పవన్ ఈ అంశాలను సీరియస్‌గా తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు ముఖ్య పాత్ర పోషించిన జనసేన, ఎన్నికల్లో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి స్థానంలో పవన్ (Pawan kalyan)ఉన్నారు. ప్రభుత్వంపై పలువురు జనసేన ఎమ్మెల్యేలు(janasena Mlas) అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. పేరుకు కూటమి ప్రభుత్వమే తప్ప హవా అంతా తెలుగుదేశం(TDP) పార్టీనే నడుపుతోందని జనసేన సమావేశంలో చర్చ జరిగింది. తమ నియోజకవర్గాల్లో అధికారులు సరిగా తమను పట్టించుకోవడం లేదని, టీడీపీ ఇంచార్జుల మాటలకే విలువ ఎక్కువ ఉందన్నారు. నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు పడక తప్పడం లేదనే చర్చ కూడా నడిచింది. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు మాత్రమే అధికారులు కొంత మాట వింటున్నారని, మిగిలిన 18 నియోజకవర్గాల్లో గెలిచిన జనసేన ఎమ్మెల్యేల కంటే తెలుగుదేశం పార్టీ తరపున ఉన్న నియోజకవర్గ ఇంచార్జిలకే విలువ ఎక్కవ ఉందని జనసేన ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పార్టీ పనితీరు, ప్రభుత్వంలో పార్టీకి ఉన్న విలువ. ప్రజలకు చేరువ కావాలంటే అధికారుల సహకారం ఉండాలని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఇలాగే కొనసాగితే తెలుగుదేశం పార్టీ నాయకులకు చులకున అవుతామనే భావన చాలా మంది జనసేన ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు.
