శ్రీకాకుళం(Srikakulam) జిల్లా గారలోని(Gara) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో(SBI) బంగారం మాయమైంది. బ్యాంకులో 7 కిలోల బంగారం(Gold) మయమైనట్టు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు, పోలీసులు(Police) విచారణ చేపట్టారు. కస్టమర్ల బంగారాన్ని ఇతర బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్లల్లో డబ్బు తీసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది చేతివాటమే బంగారం మాయం కావడానికి కారణమని భావిస్తున్నారు. ఇంతలోనే ఆ బ్యాంక్‌ డిప్యూటీ మేనేజర్‌ ఆత్మహత్య చేసుకుంది. వివరాలు చూస్తే...

శ్రీకాకుళం జిల్లా ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా ఉరిటి స్వప్నప్రియ(Swapna Priya) పనిచేస్తున్నారు. తల్లితో కలిసి శ్రీకాకుళంలోని పి.ఎస్‌.కాలనీలో ఉంటున్నారు. బంగారం మాయమైందన్న వార్తలు రావడంతో ప్రాంతీయ అధికారికి రాజు బ్యాంకుకు వచ్చి బంగారాన్ని పరిశీలించారు. బ్యాంకులో బంగారం పోయిందన్న వార్తలు నమ్మవద్దని, ఆడిట్‌ జరగడం వల్లనే బంగారంపై లెక్కలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. డిసెంబర్‌ 8వరకు వేచి చూడాలని, ఆలోగా బంగారాన్ని కస్టమర్లకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో బ్యాంకులో బంగారం బాధ్యతలను నిర్వహించే డిప్యూటీ మేనేజర్‌ స్వప్న ప్రియ గత నెల 29న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంటి దగ్గరే స్వప్న ప్రియకు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో స్వప్నప్రియ ఆరోగ్యం మరింత క్షీణించడంతో విశాఖకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈమె సోదరుడు కూడా ఎస్‌బీఐలోనే రిలేషన్‌షిప్‌ మేనేజర్‌గా(Relationship manager) బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కాగా తన కూతురు మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని శ్రీకాకుళం టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే బ్యాంకులో బంగారం మాయమైందన్న వార్తలు బయటకు పొక్కిన సమయంలోనే డిప్యూటీ మేనేజర్‌ స్వప్నప్రియ ఆత్మహత్యకు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది.

Updated On 1 Dec 2023 6:54 AM GMT
Ehatv

Ehatv

Next Story