గుంటూరు (Guntur) జిల్లాలో సత్తెనపల్లి చాలా కీలకమైన నియోజకవర్గం. సత్తెనపల్లి అంటే.. పలానా పార్టీకి కంచుకోట అని చెప్పడానికి కూడా వీల్లేని విధంగా ఉంటుంది ఇక్కడి రాజకీయం. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు (Kodela Siva Prasada Rao) ఇక్కడ గెలుపు జెండా ఎగరేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన అంబటి రాంబాబు(Ambati Rambabu).. ప్రస్తుతం జగన్(Jagan) క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రధాన పార్టీలైన వైసీపీ నుంచి అంబటి రాంబాబు, టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) పోటీలో కనిపిస్తున్నారు. కానీ..మంత్రి అంబటికి ఈసారి టికెట్ డౌటేననే పరచారం జరుగుతోంది.

ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి రాంబాబు(Ambati Rambabu)..జగన్ మంత్రివర్గంలో ఉన్నారు. 2024లో కూడా సత్తెనపల్లి నుంచి తానే పోటీ చేస్తానంటున్నారు. అయితే మారుతున్న రాజకీయ సమీకరణలతో ఈసారి మంత్రి అంబటికి టికెట్ డౌటేనన్న చర్చ జరుగుతోంది. అంబటి పట్ల సత్తెనపల్లిలో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. అంబటి నాన్ లోకల్ అభ్యర్థి అన్న పేరు కూడా ఉంది. మంత్రి అంబటి(Ambati Rambabu) పట్ల కాపు సామాజికవర్గంలో అంతగా సానుకూలంగా లేదు. అంబటి అభ్యర్ధిత్వం పట్ల సొంత పార్టీలోనూ వ్యతిరేకత ఉంది. ఆయనను మార్చాలని పార్టీ నేతలు పట్టుబడతున్నారు. దీనికితోడు టీడీపీ-జనసేన(Tdp-Janasena) పొత్తు తెరపైకి రావడంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆలోచన మారిందట. సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జీగా ఉన్న మాజీ మంత్రి కన్నా లక్షీనారాయణ(Kanna Lakshminarayana)..అక్కడి నుంచి పోటీ చేస్తారని సమాచారం. ఆయన కాపు సామాజికవర్గంలో బలమైన నేత. దాంతో అంబటి రాంబాబును పక్కనపెట్టి.. మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి(Yerram Venkateshwara Reddy)కి టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది.

ఎర్రం వెంకటేశ్వరరెడ్డి(Yerram Venkateshwara Reddy) సత్తెనపల్లిలో బలమైన నాయకుడు. ఆయన 2004, 2009లలో రెండు సార్లు కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఇక 2019లో జనసేన తరఫున పోటీ చేసిన ఎర్రం వెంకటేశ్వరరెడ్డికి 10వేల ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో ఆయనకు మంచి పేరు ఉంది. దాంతో ఆయన పట్ల వైసీపీ అధినాయకత్వం మొగ్గు చూపుతోందని సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. జనంతో మమేకం అవుతున్నారట. మరి.. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి(Sattenapalle)లో మాజీ ఎమ్మెల్యే చురుగ్గా తిరుగుతున్నారంటనే.. హైకమాండ్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయని అంతా అనుకుంటున్నారు. దాంతో అంబటికి సత్తెనపల్లి సీటు ఇవ్వకపోవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఈసారి అంబటి సొంత నియోజకవర్గం రేపల్లె నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సీటులో టీడీపీ బలంగా ఉంది. గతంలో రేపల్లె నుంచి వరసగా రెండు సార్లు గెలిచిన అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad)..అభ్యర్ధిగా ఉంటారని అంటున్నారు. ఆయనను ఢీ కొట్టి అంబటి ఇక్కడ నుంచి గెలవాల్సి ఉంటుంది. అంబటి టికెట్‎కి ఎర్రం ఎసరు పెడుతారనేదానిపై సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Updated On 26 Dec 2023 2:17 AM GMT
Ehatv

Ehatv

Next Story