Swarupananda Swamy : చంద్రబాబును కొత్తగా పొగడటం లేదు.... శారదా పీఠాధిపతి స్వరూపానంద
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రభుత్వం మారింది. దాంతో పాటు కొందరి స్వరాలు కూడా మారాయి. తెలుగుదేశం(TDP), జనసేన(Janasena), భారతీయ జనతాపార్టీల కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందని అంటున్నారు విశాఖ శారదా పీఠాధిపతి(Sharada Peethadhipati) స్వరూపానంద స్వామి(Swarupananda Swamy). ఎల్లవేళలా జగన్మోహన్‌రెడ్డికి(Jagan Mohan reddy) ఆశీస్సులు అందించిన స్వరూపానందస్వామి ఇప్పుడు చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్‌లను(Pawan kalyan) పొగడటం ఆశ్చర్యంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రభుత్వం మారింది. దాంతో పాటు కొందరి స్వరాలు కూడా మారాయి. తెలుగుదేశం(TDP), జనసేన(Janasena), భారతీయ జనతాపార్టీల కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందని అంటున్నారు విశాఖ శారదా పీఠాధిపతి(Sharada Peethadhipati) స్వరూపానంద స్వామి(Swarupananda Swamy). ఎల్లవేళలా జగన్మోహన్‌రెడ్డికి(Jagan Mohan reddy) ఆశీస్సులు అందించిన స్వరూపానందస్వామి ఇప్పుడు చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్‌లను(Pawan kalyan) పొగడటం ఆశ్చర్యంగా ఉంది. తామెప్పుడూ ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతం తప్ప సంపాదన కోసమో, పదవుల కోసమో చెప్పే మనస్తత్వం తనది కాదని స్వరూపానంద స్వామి అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం చాల బలమైనదని చెప్పారు. ప్రజలకు మేలు , ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం కలిగే విధంగా పరిపాలించాలని చంద్రబాబును ఆశీర్వదించారు. కేంద్రంతో ఉండే సన్నిహిత, సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని నమ్మకం తనకుందన్నారు. అమరావతిలో కూడా శారదా పీఠం నిర్మిస్తామని, ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని స్పష్టం చేశారు. త్వరలోనే చాతుర్మాస పూజలకోసం రుషికేశ్ వెళ్తున్నానని, అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నాని స్వారూపానందస్వామి తెలిపారు. చాతుర్మాస దీక్ష అనంతరం హైదరాబాద్‌లోని శారదా పీఠంలో స్థిరపడాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తనకు అత్యంత ఆత్మీయుడు అయిన ఎర్రన్నాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేబినెట్లో మంత్రి కావడం సంతోషంగా ఉందన్నారు. అమ్మ వారి కృపతో నరేంద్రమోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఆనందం కలిగించిందని చెప్పారు. చంద్రబాబును కొత్తగా పొగుడుతూ ఉన్నానని అనుకోవద్దన్నారు. గతంలో ఆయన గెలవాలని మురళీమోహన్‌తో కలిసి పూజలు, హోమాలు చేశామని స్వరూపానందస్వామి అన్నారు. చంద్రబాబు విజయం కోసం సాధువులందరితో కలిసి పూజలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎవరికీ భయపడి ఈ మీడియా సమావేశం పెట్టడం లేదన్నారు. తనపై, శారదాపీఠంపై తప్పుడు అభిప్రాయాలు ప్రచారం జరగకుండా ఉండేదుకే ప్రెస్‌మీట్ పెట్టినట్టు స్వరూపానందతెలపారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని, ఆయన చాలా సీనియర్ నేతని, మరికొన్ని కాలాలపాటు ఆయురారోగ్యాలతో బాగుండాలని స్వరూపానందస్వామి అన్నారు.