YS Jagan Sankranti Celebrations : తాడేపల్లి సీఎం నివాసంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
ఏపీలో సంక్రాంతి(Sankranti) సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తాడేపల్లిలో(thadepalli) సీఎం వైఎస్ జగన్(CM Jagan) అధికార నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. ప్రతి ఏటా పండుగనాడు తన నివాసానికి వచ్చే రైతులు, ప్రజలతో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సీఎం నివాసం ఆవరణలో వేసిన స్పెషల్ సెట్ మరింత ఆకర్షణగా నిలిచింది.

YS Jagan Sankranti Celebrations
ఏపీలో సంక్రాంతి(Sankranti) సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తాడేపల్లిలో(thadepalli) సీఎం వైఎస్ జగన్(CM Jagan) అధికార నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. ప్రతి ఏటా పండుగనాడు తన నివాసానికి వచ్చే రైతులు, ప్రజలతో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సీఎం నివాసం ఆవరణలో వేసిన స్పెషల్ సెట్ మరింత ఆకర్షణగా నిలిచింది. ఇందులో సీఎం దంపతులు శ్రీ వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
తొలుత సీఎం వైఎస్ జగన్, భారతమ్మ(YS Bharathi) దంపతులు సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. బసవన్నలకు సారెను సమర్పించిన అనంతరం గోపూజ కార్యక్రమంలో సీఎం పంపతులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురష్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్యర్యంలో జరిగిన ఈ వేడుకల్లో.. తెలంగాణ కళాకారుల ప్రదర్శన పత్ర్యేక ఆకర్షణ నిలిచింది. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకంక్షలు తెలిపారు. ‘‘ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై..అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాలతో..విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.
