జనవరి (January )మాసంలో వాతావరణం ఆహ్లాదంగా వుంటుంది. మంచుకురిసే వేళలో శీతగాలులు గిలిగింతలు పెట్టే కాలంలో. సూర్యుడు మకర సంక్రాంతి (sankranti)రోజున ఉత్తరాయణ పథంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ సమయంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, సూర్యభగవానుని అనుగ్రహం పొందిన వారికి సిరిసంపదలకు, సుఖసంతోషాలకు లోటుండదని భక్తుల భావన. తెలుగు వారు అత్యంత ప్రీతిపాత్రంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలలో ఈ పండగని సంక్రాంతి అనే పిలుస్తారు. తమిళులు పొంగల్‌(pongal) అంటారు. మహారాష్ట్రులు, గుజరాతీలు మకర్‌ సంక్రాంతి అని, పంజాబ్‌, హర్యాలలో లోరీ(lohri)అని వ్యవహరిస్తారు.

జనవరి (January )మాసంలో వాతావరణం ఆహ్లాదంగా వుంటుంది. మంచుకురిసే వేళలో శీతగాలులు గిలిగింతలు పెట్టే కాలంలో. సూర్యుడు మకర సంక్రాంతి (sankranti)రోజున ఉత్తరాయణ పథంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ సమయంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, సూర్యభగవానుని అనుగ్రహం పొందిన వారికి సిరిసంపదలకు, సుఖసంతోషాలకు లోటుండదని భక్తుల భావన. తెలుగు వారు అత్యంత ప్రీతిపాత్రంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలలో ఈ పండగని సంక్రాంతి అనే పిలుస్తారు. తమిళులు పొంగల్‌(pongal) అంటారు. మహారాష్ట్రులు, గుజరాతీలు మకర్‌ సంక్రాంతి అని, పంజాబ్‌, హర్యాలలో లోరీ(lohri)అని వ్యవహరిస్తారు.

పుణ్యదినాల్లో చేసే దానాలు ఎంతో శ్రేష్టమని పురాణాలు చెప్తున్నాయి. ధాన్యం(rice), పళ్లు(milk), బట్టలు, (clothes) కాయగూరలు, నువ్వులు, చెరకు మొదలైనవి దానం చేస్తే మంచిదంటారు. పితృలకు తర్పణలు ఇచ్చే ఆచారమూ వుంది. సంక్రాంతినాడు పాలుపొంగించి, దానితో పరమాన్నం చేస్తారు. ఇదే కాదు- అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సకినాలు, పాలతాలికలు, సేమియా పాయసం, పులిహోర, గారెలు వంటి వంటకాలు తయారుచేస్తారు. ఇళ్లముందు తీర్చే ముగ్గుల ముచ్చట్ల విషయానికి వస్తే అలికిన వాకిళ్లు నిర్మలాకాశంతో సమానం.

ఒక పద్దతి ప్రకారం పెట్టే చుక్కలు రాత్రివేళ కనిపించే నక్షత్రాలకు దర్పణం. చుక్కల చుట్టూ వేసే అల్లికలు ఆకాశంలో కనిపించే మార్పులకు సంకేతం. ముగ్గు మధ్యలో కేంద్రంగా వుండే ముద్దు సూర్యుడి స్థానానికి సూచిక. పండగ ఆఖరి రోజున రథం ముగ్గు వేయడం ఆనవాయితీ..! ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు (gobemmal)కృష్ణుని భక్తురాళ్లయిన గోపికలకు (gopika)సంకేతం. మధ్యలో పెద్దే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవిగా భావిస్తారు. గంగిరెద్దుల మేళానికి ఒక పరమార్ధముంది. శివగణంతో సహా ఆ పరమశివుడు సంక్రాంతి సంబరాలకు హాజరయినట్టుగా గంగిరెద్దుని పెద్దలు వివరిస్తారు. హరిని కీర్తించే భక్తులకు హరిదాసు (haridasu)రాక అనేది పరమ పవిత్ర కార్యంతో సమానం.

హరిదాసుని వారు సాక్షాత్‌ శ్రీకృష్ణుడి (lord krishna) ప్రతిరూపంగా భావిస్తారు. హరిదాసు తల మీద గుమ్మడి కాయ ఆకారంలో వుండే రాగి అక్షయపాత్ర గుండ్రటి భూమికి సంకేతం. దాన్ని తలపై పెట్టుకోవడం ద్వారా శ్రీహరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని చెప్పడంగా పెద్దలు వివరిస్తారు. 'హరిలో రంగ హరీ' అంటూ కంచుగజ్జెలు ఘల్లుఘల్లున మోగిస్తూ, చిడతలు వాయిస్తూ హరిదాసులు ఇల్లిల్లూ తిరుగుతూ పర్వదిన శోభకే వన్నె తెస్తారు.

సంక్రాంతి అనేది ఉమ్మడి సంస్కృతికి నిదర్శనం. ప్రకృతి శక్తులకు ప్రణమిల్లే పండగ. కాలగమనానికి, సూర్యభగవానుడికి సంబంధించిన సంబరం. మధుర రసాలతో జీవితం రసమయం అయ్యే పండగ. తియ్యని చెరుకుగడలతో, పాలపొంగులతో వర్ధిల్లే పచ్చని వేడుక. ఉందిలే మంచికాలం ముందుముందునా అని పాడుకోనక్కరలేదు. సంక్రాంతితో అది మన నట్టింటికి వచ్చేసినట్టే. ఇది ఇటీవలి భావన కాదు. అనాదిగా వస్తున్న నమ్మకం. మన దేశానికే పరిమితం కాదు. దేశదేశాల్లోనూ వున్నదే. సూర్యభగవానుడు ఎల్లెడలా అనాదిగా ఆరాధనీయుడు. మంచు ప్రదేశాల్లో వెచ్చిన కాంతులు విరజిమ్మే దేవుడు ప్రత్యక్ష దైవంతో సమానం కనుక- ఉత్తరాయణ పథంలో ఆయన ప్రవేశం వారికి కూడా పండగే.

లాటిన్‌ అమెరికాలో పురాతత్వ పరిశోధకులు జరిపిన అధ్యయనాల్లో ఆరు వేల ఏళ్ల క్రితమే మయ జాతీయులు సంక్రాంతి వంటి పండగని ఘనంగా జరుపుకునే వారని తెలిసింది. ఆచార వ్యవహారాలలో, పేర్లలో కొద్దిపాటి ప్రాంతీయ వ్యత్యాసాలతో దాదాపు దక్షిణాసియాలో అనేక దేశాల్లో ఈ పండుగని ఘనంగా నిర్వహిస్తారు. నేపాల్‌లోని థారూ ప్రజలు ఈ పండగని మాఘీగా, ఇతరులు మాఘే సంక్రాంతిగా జరుపుకుంటారు.థాయ్‌లాండ్‌లో జరిగే సోంగ్‌క్రాన్‌, లావోస్‌లో జరిగే పి మ లావో, మయన్మార్‌లో జరిగే థింగ్‌యాన్‌, కంబోడియాలో నిర్వహించే మోహ సంగ్‌క్రాన్‌ పండగ వంటివి సంక్రాంతి వేడుకలే.

ఇక ఉత్తరభారతంలోని అస్సాంలో మాఘ్‌ బిహు లేదా భోగలీ బిహూ అని, కశ్మీర్‌లో శిశుర్‌ సంక్రాంత్‌ అని వ్యవహరిస్తారు. ఇక సంక్రాంతి పురాణ ప్రాశస్త్యం విషయానికి వస్తే సంక్రాంతి పర్వదినాలలో మహావిష్ణువు రాక్షసులని హతమార్చి, వాళ్ల శిరస్సులు మంధర పర్వతం కింద పాతిపెట్టి దేవతలకి సుఖసంతోషాలు సమకూర్చిపెట్టాడట! అందుకే ఈ పండుగని అశుభాలకి స్వస్తిగా, శుభాలకి స్వాగతంగా భక్తులు విశ్వసిస్తారు. భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగానదిని భూమికి అవతరింపచేసింది కూడా సంక్రాంతినాడేనట. అందుకే గంగ సముద్రంలో సంగమించే స్థలంలో మకర సంక్రాంతి పర్వదినాన లక్షలాది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పితృదేవతలకి తర్పణలిస్తారు.

సూర్యారాధన ఒక్క మన భారతావనిలోనే కాదు. ప్రపంచమంతటా కనిపిస్తుంది. మహోజ్వలంగా వెలుగొందిన అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ సూర్యారాధన కనిపిస్తుంది. అంతకు ముందు ఆదిమవాసులు సూర్యడిని గొప్ప వేటగాడి రూపంలో పూజించారు. ఎన్నో దేశాలు, రాజవంశాలు సూర్యడి పేరుతో అవతరించాయి. శ్రీరామచంద్రుడు సూర్యవంశపు రాజే! ఈజిప్టు, జపాన్‌, మెక్సికో, పెరూ మొదలైన దేశాలలో సూర్యుడిని భగవంతుడి స్వరూపంగా కొలుస్తారు. మనక్కూడా ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడేగా! సంక్రాంతిని గ్రీకులు బేకస్‌ అని పిలుచుకుంటే రోమన్లు బ్యాకన్‌ అని అంటారు.

సంక్రాంతి ధర్మాలతో పాటు వైద్య ధర్మాలను కూడా మనకు బోధిస్తుంది. ధనుర్మాసంలో ఉదయాన్నే పొంగలి తినడం కూడా ఆరోగ్య సూత్రమే! చలికాలంలో చలికి శరీరంలోని చర్మ రంధ్రాలన్నీ మూసుకుపోతాయి. అంచేత శరీరంలోని వేడి బయటికి వెళ్లే మార్గం లేక జీర్ణ కోశాన్ని చేరుతుంది.ఫలితంగా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది.. అంతేకాకుండా పగటి కంటే రాత్రి హెచ్చు కావడం వల్ల రాత్రి చేసిన భోజనం త్వరగా జీర్ణమైపోతుంది. అందుకే ఉదయానికల్లా ఆకలి వేస్తుంది. అప్పుడు ఆహారం తీసుకోకపోతే రోగాలు రావడం ఖాయం. అందుకే భక్తి పేరు చెప్పి ప్రసాదం పేరుతో ఉదయాన్నే పొంగలి పంపకం జరుగుతుంటుంది.

భోగి రోజు నువ్వు పిండిని వంటికి పట్టించుకుని పిడుకల మంట దగ్గర శరీరాన్ని కాచుకుంటే చర్మం మెత్తదనం సంతరించుకుంటుంది. కఫం నశిస్తుంది. గోధుమలు, మినుములు వంటి ధాన్యాలతో చేసిన వంటకాలను తినడం వల్ల వాతం హరించుకుపోతుంది. శరీరానికి బ్రహ్మతేజస్సు లభిస్తుంది. సంస్కృతీ సంప్రదాయాలు అడుగంటిపోతున్న ఈ కాలంలోనూ సంక్రాంతి వైభవం కొంచెం కూడా తగ్గలేదు. ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తున్న సంక్రాంతి పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా గొప్పగా జరుపుకుంటున్నారు. ఇదే ఈ పండుగ గొప్పదనం

Updated On 14 Jan 2024 1:04 AM GMT
Ehatv

Ehatv

Next Story