Free Haircut For Voters : ఓటు వేయండి.. ఫ్రీగా కటింగ్ చేసుకోండి
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పోలింగ్(Poling) జరుగనుంది. పోలింగ్‌కు కొద్దిరోజులు మాత్రమే మిగిలివుంది. అయితే ఎన్నికల రోజున సెలవు ఉండడంతో కొందరు షికార్లకు వెళ్తుంటారు లేదా ఇంట్లో తొంగుంటారు కానీ ఓటు(Vote) వేయాలన్న ఆసక్తి ఉండదు. దీంతో ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు విశాఖలోని ఓ సెలూన్(Saloon) నిర్వాహకుడు వినూత్న ప్రచారం చేస్తున్నాడు.
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పోలింగ్(Poling) జరుగనుంది. పోలింగ్‌కు కొద్దిరోజులు మాత్రమే మిగిలివుంది. అయితే ఎన్నికల రోజున సెలవు ఉండడంతో కొందరు షికార్లకు వెళ్తుంటారు లేదా ఇంట్లో తొంగుంటారు కానీ ఓటు(Vote) వేయాలన్న ఆసక్తి ఉండదు. దీంతో ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు విశాఖలోని ఓ సెలూన్(Saloon) నిర్వాహకుడు వినూత్న ప్రచారం చేస్తున్నాడు. విశాఖ కంచరపాలెం(Kancharapalem) మెట్టులోని ముత్యాలమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న ఆర్‌కే స్మార్ట్ సెలూన్ యజమాని రాధాకృష్ణ ఆకర్షణీయ ప్రకటన చేశాడు. ఓటు అనేది మన భవిష్యత్‌కు సంబంధించిందని, భావితరాలకు ఓటు ఎంత ముఖ్యమో వివరించాడు. ఓటర్లు విధిగా తమ ఓటును వినియోగించుకోవాలని, ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ బంపరాఫర్ ప్రకటించాడు.
ఓటు ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఉచిత హెయిర్ కటింగ్ ఆఫర్‌ను(Free Hair Cutting) ప్రకటించినట్లుగా వెల్లడించాడు. “ఓటు మన హక్కు. మన భవిష్యత్తును, భావి తరాల భవిష్యత్తును కాపాడే ఆయుధం. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు మే 13న ఓటు వేసిన వారికి ఉచిత హెయిర్‌కట్ చేయబడును అని ఆఫర్ పెట్టారు. ఆ రోజు ఓటు హక్కును వినియోగించుకుని తమ సెలూన్‌కు వచ్చే వారందరికీ మా బృందం ఉచితంగా హెయిర్ కట్ చేస్తామని రాధాకృష్ణ తెలిపారు.