Vijay Sai Reddy : విజయసాయిరెడ్డిని లైట్ తీసుకున్న సాక్షి!
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మరే ఇష్యూలు లేనట్టుగా, మరే ముఖ్యమైన విషయాలు లేనట్టుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఎంపీ విజయసాయి రెడ్డి(Vijay Sai Reddy) వివాదాన్ని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా భుజాన వేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మరే ఇష్యూలు లేనట్టుగా, మరే ముఖ్యమైన విషయాలు లేనట్టుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఎంపీ విజయసాయి రెడ్డి(Vijay Sai Reddy) వివాదాన్ని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా భుజాన వేసుకుంది. విజయసాయిరెడ్డి వ్యక్తిత్వ హననానికి పూనుకుంటోంది. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న శాంతి(Officer shanthi) అనే మహిళకు విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఇది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా(TDP Media) చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తోంది. దీనిపై విజయసాయిరెడ్డి ఫైరయ్యారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తన ఇమేజ్ ని భ్రష్టు పట్టించే పనిని చేయడం పట్ల ఆయన మండిపడ్డారు. అదే విశాఖలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి అందరినీ ఓ ఆట ఆడుకున్నారు. తాను తప్పు చేయలేదని తన మీద తప్పుడు ఆరోపణలు చేసిన వారి మీద పరువు నష్టం దావా వేస్తాను అని హెచ్చరించారు. పనిలో పనిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద ఆయన మండిపడ్డారు. తన మీద సొంత పార్టీ వారూ ఫిర్యాదులు గతంలో చేశారు అని గుర్తు చేసుకున్నారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదని, నిరాధార ఆరోపణలు చేస్తూ తన క్యారెక్టర్‌ను దెబ్బతీస్తున్నారన్నారు. ఇంకా చాలా చాలా అన్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాపై విజయసాయిరెడ్డి ఫైర్ అయితే సాక్షి మీడియా ఏ రేంజ్‌లో కవరేజ్ ఇవ్వాలి? విజయసాయిరెడ్డిపై ఆరోపణలను టీడీపీ అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది కదా! మరి దానికి కౌంటర్ ఇచ్చినప్పుడు సాక్షిలో ప్రముఖ వార్త కావాలి కదా! అలాంటిదేమీ లేదు. సింగిల్ కాలమ్‌తో సరిపెట్టుకుంది. అది కూడా ఏడో పేజీలో! తెలంగాణ ఎడిషన్‌లో అయితే ఈ మాత్రం వార్త కూడా లేదు. ఉద్దేశపూర్వకంగానే విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్‌కు సంబంధించిన వార్తను సింగిల్‌కాలమ్‌కు పరిమితం చేశారా? లేక పొరపాట జరిగిందా? ఇదే ఏ టీడీపీ నేతనో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పై విరుచుకుపడినప్పుడు టీడీపీ అనుకూల మీడియా ఎంత గొప్ప కవరేజ్ ఇస్తుందో మనం చూస్తున్నాం! మరి సాక్షికి ఏమైంది? ఎందుకు ప్రముఖంగా ప్రచురించలేదు? వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌కే కాదు, టీడీపీ అభిమానులకు కూడా ఇది అంతుపట్టడం లేదు.