Sakshi Tv Rating : పెరిగిన సాక్షి రేటింగ్, తగ్గిన ఏబీఎన్ రేటింగ్ .. కారణమేమిటంటే....
గురువారం వచ్చేసరికి న్యూస్ ఛానెల్స్(News channel) హెడ్స్‌కు బీపీ మొదలవుతోంది. హార్ట్ బీట్ ఎక్కువవుతుంది. అన్ని ఛానెల్స్‌కు కాదు కానీ, టాప్ ఫైవ్ ఛానెల్స్ వాళ్లకు మాత్రం గురువారం ఫోబియా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఆ రోజు వచ్చే రేటింగ్స్(Ratings) వారి పనితీరును బేరీజు వేస్తాయి కాబట్టి. ఎప్పటిలాగే ఈవారం కూడా ఎన్టీవీ(NTV) నంబర్‌వన్ పోజిషన్‌లో ఉంది. మధ్యలో నాలుగైదు వారాలు టాప్ పోజిషన్‌లోకి వచ్చిన టీవీ9(TV9) యథావిధిగా సెకండ్‌ప్లేస్‌లో కొట్టుమిట్టాడుతోంది.
గురువారం వచ్చేసరికి న్యూస్ ఛానెల్స్(News channel) హెడ్స్‌కు బీపీ మొదలవుతోంది. హార్ట్ బీట్ ఎక్కువవుతుంది. అన్ని ఛానెల్స్‌కు కాదు కానీ, టాప్ ఫైవ్ ఛానెల్స్ వాళ్లకు మాత్రం గురువారం ఫోబియా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఆ రోజు వచ్చే రేటింగ్స్(Ratings) వారి పనితీరును బేరీజు వేస్తాయి కాబట్టి. ఎప్పటిలాగే ఈవారం కూడా ఎన్టీవీ(NTV) నంబర్‌వన్ పోజిషన్‌లో ఉంది. మధ్యలో నాలుగైదు వారాలు టాప్ పోజిషన్‌లోకి వచ్చిన టీవీ9(TV9) యథావిధిగా సెకండ్‌ప్లేస్‌లో కొట్టుమిట్టాడుతోంది. పక్షం రోజుల ముందు నుంచే అయోధ్య ఇష్యూను టేకప్ చేసిన టీవీ9 ఆశించినంత రేటింగ్‌ను సంపాదించలేకపోయింది. పైగా ఈవారం ఆరు శాతం తగ్గుదల కనిపించింది. ఒక్క అయోధ్య ఇష్యూ తప్ప మేజర్ ఈవెంట్స్ పెద్దగా లేకపోవడంతో ఎన్టీవీ రేటింగ్ కూడా మూడుశాతం తగ్గింది. ఆమాటకొస్తే అన్ని ఛానెళ్ల రేటింగ్స్ తగ్గాయి. ఆశ్చర్యకరమైన విషయమేమింటే సాక్షి(Sakshi) ఛానెల్‌కు మూడు శాతం రేటింగ్ పెరగడం! ఈ దెబ్బతో గతవారం ఆరో స్థానంలో ఉన్న సాక్షి ఇప్పుడు అయిదో స్థానానికి ఎగబాకింది. సాధారణంగా ప్రభుత్వ కొమ్ముకాసే ఛానెల్స్‌ను జనం పెద్దగా పట్టించుకోరు.
సాక్షి మాత్రం ఇందుకు భిన్నమైన ఫలితాలను సాధించింది. నిత్యం చంద్రబాబు(Chandrababu) సేవలో తరించే ఎబీఎన్(ABN Channel) ఛానెల్ అయిదో స్థానం నుంచి ఆరోస్థానానికి దిగజారింది. సాక్షిరేటింగ్స్ పెరగడం వెనుక గతవారం ఏపీలో నెలకొన్న రాజకీయపరిణామాలు కారణం కావచ్చు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రెండు మూడు సభలలో పాల్గొన్నారు. అదీ కాకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేసుల విషయంపై కూడా ప్రేక్షకులలో క్యూరియాసిటీ ఉంది. పైగా జనవరి 16వ తేదీన 17 ఎపై సుప్రీం కోర్టులో(Supreme Court) తీర్పు వచ్చింది. 17ఏ(17A) పై సుప్రీంకోర్టు ఏం చెబుతుందా అన్న ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉండింది. ఆ ఆసక్తితోనే ఆ రోజున టీవీలకు అతుక్కుపోయారు. ముఖ్యంగా సాక్షి చానెల్‌ను ఎక్కువ మంది వీక్షించారు. కొమ్మినేని శ్రీనివాసరావు పున: ప్రవేశం కూడా చానెల్‌కు అడ్వాంటేజ్‌గా మారింది. ఎంతకాదనుకున్నా కొమ్మినేని డిబేట్‌కు మంచి వ్యూవర్‌షిపే ఉంది. అది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది కూడా! ఏ న్యూస్ చానెల్ డిబేట్లకు కూడా ఇంత వ్యూవర్‌షిప్ ఉండదు. మొత్తం మీద ఈవారం ఒక్క సాక్షి చానెల్‌కు మాత్రమే పెరుగుదల కనిపించింది. వీ6 చానెల్ థర్డ్ ప్లేస్‌లోనే ఉన్నా ఈవారం ఆ ఛానెల్ రేటింగ్ బాగా తగ్గింది. గత వారంతో పోలిస్తే12 శాతం పడిపోయింది. టీవీ 5 రేటింగ్ ఏడు శాతం తగ్గింది. మిగిలిన ఛానెల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీలేదు. కిందటివారం ఏ ప్లేస్‌లో ఉన్నాయో ఈ వారం కూడా అవి అవే స్థానాలలో కొనసాగుతున్నాయి.