వైసీపీ ఓడిపోయిన తర్వాత రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

వైసీపీ ఓడిపోయిన తర్వాత రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొన్ని పుకార్లు, చర్చలు జరుగుతున్నాయి. 2024 నవంబర్‌లో, జగన్ మోహన్ రెడ్డి సజ్జలను పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించినప్పుడు, పార్టీ క్యాడర్‌లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. కొందరు నాయకులు, కార్యకర్తలు ఆయన నిర్ణయాల వల్ల 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమని భావించారు. అయితే, జగన్ ఇప్పటికీ సజ్జలపై నమ్మకం ఉంచినట్లు కనిపిస్తోంది. ఇటీవల, 'యువత పోరు' కార్యక్రమం సందర్భంగా సజ్జల చిత్రం పోస్టర్‌లలో ప్రముఖంగా కనిపించడం, జగన్ చిత్రం చిన్నగా ఉండటంతో క్యాడర్‌లో మరింత చర్చ జరిగింది. సజ్జల రాజీనామా గురించి చర్చ జరిగింది, కానీ అది కేవలం ఊహాగానాలుగా కనిపిస్తోంది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సజ్జల ప్లేస్‌లో సతీష్‌రెడ్డిని పెడతారనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సతీష్ రెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే, ఇటీవలి కాలంలో వైసీపీలో కొన్ని నాయకుల స్థానాల్లో మార్పులు, కొత్త నియామకాల గురించి చర్చలు జరుగుతున్నాయి. సతీష్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు.. పులివెందులలో కీలక పాత్ర పోషిస్తున్నాడని పార్టీ వర్గాల్లో టాక్ ఉంది.

జిల్లాల నియామకాలను పూర్తి చేయటంతో పాటుగా పార్టీలో కీలక నేతల బాధ్యతల్లోనూ మార్పులకు సిద్దం అయ్యారు. జగన్ కోటరీ పేరుతో సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య లు పార్టీలో చర్చగా మారాయి. భారీ ఓటమితో అవసరమైన మార్పుల దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సజ్జల స్థానంలో మరో కీలక నేతకు బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సిద్దమయ్యారు. టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన సతీశ్ రెడ్డి పులివెందులలో వైఎస్ కుటుంబం పైన ఎన్నికల్లో పోటీ చేసారు. 2024 ఎన్నికల సమయంలో పులివెందుల టికెట్ బీటెక్ రవికి టీడీపీ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో సతీశ్ రెడ్డి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్నారు. జగన్ పైన విమర్శల సమయంలో ఘాటుగా స్పందిస్తున్నారు. సజ్జల స్థానంలో సతీష్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.

ehatv

ehatv

Next Story