Sajjal Ramakrishna Reddy : 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు సున్నా సీట్లు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో(AP Election 2024) చంద్రబాబు(chandrababu) రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఏ ఒక్కటీ గెలుచుకునే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ(YCP) ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjal Ramakrishna Reddy) అన్నారు. కుప్పంతో సహా అన్ని స్థానాల్లోనూ ఓడిపోయి- సున్నా టీడీపీగా(TDP) మిగిలే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు ఆయన ఏదొక కారణం చెప్పడానికి వీలుగా ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడని అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో(AP Election 2024) చంద్రబాబు(chandrababu) రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఏ ఒక్కటీ గెలుచుకునే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ(YCP) ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjal Ramakrishna Reddy) అన్నారు. కుప్పంతో సహా అన్ని స్థానాల్లోనూ ఓడిపోయి- సున్నా టీడీపీగా(TDP) మిగిలే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు ఆయన ఏదొక కారణం చెప్పడానికి వీలుగా ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడని అన్నారు. అందుకే.. అత్యంత పారదర్శకంగా పాలన నడుపుతున్న ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలకు కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో భాగంగానే తనకు వత్తాసు పలికే ఈనాడు(Enadu), ఆంధ్రజ్యోతితో(Andhra jyoti) పాటు ఈటీవీ(Etv), ఏబీఎన్(ABN), టీవీ5(TV5) మరో తోక మీడియాలను పట్టుకుని వాటితో అభూతకల్పనల కథనాల్ని రాయించడం.. వాటిపైనే ఈయన మరోమారు ప్రెస్‌మీట్‌లు పెట్టి మాట్లాడటం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. వీటిల్లో భాగంగానే మరోవైపు మేధావుల సంఘాలంటూ ఊరూపేరులేని వ్యక్తుల్ని తీసుకొచ్చి వారికి ఏదొక పదవుల్ని తగిలించి ప్రభుత్వాన్ని విమర్శించమని చెప్పడం.. వారి నోటిమాటల్ని ప్రజాభిప్రాయంగా చిత్రీకరించాలనే ప్రయత్నాల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఎలాంటి కుట్రలకైనా దిగే మనస్తత్వం చంద్రబాబుదన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ(YSRTP) మద్ధతుదార్ల ఓట్లుతో పాటు న్యూట్రల్ ఓట్ల తొలగింపునకు చంద్రబాబు అండ్ కో కుట్రలు చేస్తుందన్నారు. అందులో భాగంగానే కోనేరు శిరిష్ అనే టీడీపీ వ్యక్తి చేత బల్క్ ఓట్లను అనుమానస్పదంగా ఉన్నాయంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారని.. తీరా, వాటిపై జిల్లా కలెక్టర్లు తమ విలువైన సమయాన్నంతా వెచ్చించి వెరిఫై చేయిస్తే బోగస్ ఓట్ల ఆరోపణలో వాస్తవాలేమీ లేవని తేలిందని వివరించారు. మై టీడీపీ యాప్‌లంటూ నాలుగైదు వెబ్‌సైట్‌లు పెట్టి పీపుల్స్ రిప్రెంజెంటేషన్ చట్టాన్ని ఉల్లఘిస్తూ ప్రజల డేటాను అనధికారంగా సేకరించడం.. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు పెట్టి మరీ నూతనంగా ఓటు హక్కు నమోదుకు రిజిస్ట్రేషన్‌లు భారీగా చేస్తున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మేము ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు.