సీఎం జ‌గ‌న్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్య‌ల‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

సీఎం జ‌గ‌న్‌(CM Jagan)పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) వ్యాఖ్య‌ల‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) స్పందించారు. ఏపీ రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని సజ్జల అన్నారు. తనకు అన్యాయం జరిగిందని షర్మిల అంటున్నారు. ఏం ఆశించి ఆమె జగన్ కోసం తిరిగారో చెప్పాలని అన్నారు. షర్మిల చేసిన ప్రతి వ్యాఖ్యకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. షర్మిల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఇలా మాట్లాడిస్తున్నారని చెప్పారు.

వైఎస్సార్(YSR) కూతురు, జగన్(Jagan) చెల్లెలు అనే ఒకే ఒక్క కారణంతో షర్మిలకు ఏపీ బాధ్యతలను కాంగ్రెస్ హైకమాండ్(Congress High Command) అప్పజెప్పిందని అన్నారు. బాధ్యతలను చేపట్టిన తొలి రోజు నుంచే వైసీపీపై షర్మిల దాడి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను తిట్టిన షర్మిల.. ఇప్పుడు అదే పార్టీలో ఎలా చేరారని ప్రశ్నించారు. జగన్ ఓదార్పు యాత్రను అణచివేసేందుకు కాంగ్రెస్ యత్నించిందని చెప్పారు. జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని.. ఇది షర్మిలకు గుర్తు లేదా? అని ప్రశ్నించారు.

ఇదిలావుంటే.. కాకినాడ(Kakinada)లో గురువారం ష‌ర్మిల‌ మాట్లాడుతూ.. వైఎస్సార్ పాలనకు, జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ కోసం 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని.. ముఖ్య‌మంత్రి అయ్యాక జ‌గ‌న్ మారిపోయాడ‌ని.. ఆయ‌నో నియంత అని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

Updated On 25 Jan 2024 6:11 AM GMT
Yagnik

Yagnik

Next Story