Sajjala Ramakrishna Reddy : ఎన్నికలకు ముందే చంద్రబాబు నిజస్వరూపాన్ని చూపిస్తున్నాడు
వాలంటీర్లపై చంద్రబాబు కక్షకు పరాకాష్ఠ ఇది.. వారి ముఖ్య ఉద్దేశం, ఫోకస్ వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయాలనే అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

Sajjala Ramakrishna Reddy Fire on Chandrababu
వాలంటీర్లపై చంద్రబాబు కక్షకు పరాకాష్ఠ ఇది.. వారి ముఖ్య ఉద్దేశం, ఫోకస్ వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయాలనే అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీళ్లు చంద్రబాబు తరఫునే పనిచేస్తున్నారనేదే దేశమంతా తెలుసు. వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయాలనే చంద్రబాబు ఉద్దేశం.. ఆ చెడ్డ పేరు తనమీదకు రాకూడదనే ఈసీతో చేయించాడని అన్నారు.
గత నాలుగేన్నరేళ్లుగా తమ మనుమడు జగన్ ఇస్తున్న పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు.. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు.. దాన్ని ఒక్క సారిగా లింక్ కట్ చేయించారు. ఇది ఒక్క రోజు ఇబ్బంది అనేది ఒకటైతే.. ఆయనొస్తే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ఆర్ధం చేసుకోవాలని సూచించారు. కాళ్లరిగేలా పింఛన్ కోసం తిరగాల్సిన పరిస్థితి.. ఇప్పటికీ 2014–19 మధ్య పాత రోజులు ఇంకా గుర్తుండే ఉంటాయన్నారు. ఇంతకంటే కక్ష మరొకటి ఉందా? అసలు ఒక రాజకీయ పార్టీ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని ప్రజలకు చూపిస్తున్నాడు. అందరూ దీన్ని గమనించాలని సజ్జల అన్నారు.
